అధీరా పాత్రలో సంజయ్ దత్ ఎందుకంటే.. సీక్రెట్ చెప్పిన యష్

కేజీఎఫ్ చాప్టర్ 1 ఘన విజయం తర్వాత రూపొందుతున్న సీక్వెల్‌ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. కేజీఎఫ్‌2 పలు సంచలనాలతో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారనే వార్త సంచలనం రేపింది. అయితే తాజాగా రిలీజైన అధీరా పాత్రలో సంజయ్ లుక్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అయితే సంజయ్‌దత్‌నే ఎందుకు తీసుకొన్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంజయ్ దత్ ఎంపికపై ఇటీవల యష్ మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పినప్పుడే అధీరా పాత్రకు సంజయ్ దత్ లాంటి వ్యక్తి అయితే బాగుంటుందని అన్నారు. కథ మొదలుపెట్టినప్పుడే అలాంటి ఆలోచనలతో పాత్రను రాసుకొన్నాడు. ఐదు భాషల్లో కేజీఎఫ్ 2 రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు సంజయ్ దత్ తప్పనిసరి అని భావించాం అని అన్నారు.

Actor Yash revealed secret about Sanjay Dutt as Adheera in KGF 2

అధీరా పాత్రలో సంజయ్ దత్ ఒదిగిపోయాడు. ఆయన నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. కేజీఎఫ్ 2 సినిమాకు సంజయ్ దత్ వెన్నముకలా మారడం ఖాయం. ఎప్పుడైతే కథ బాగుంటుందో.. ఇతర అంశాలన్నీ దానిలో భాగమవుతాయి అని యష్ అన్నారు. ప్రశాంత్ నీల్ ఎప్పుడూ స్వచ్ఛంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనల్లో స్వచ్ఛత కనిపిస్తుంది అని అన్నారు.

సంజయ్ దత్ అద్భుతమైన యాక్టర్. అతడి దేహధారుడ్యం, ఇమేజ్, లెగసీ లాంటి అంశాలు కేజీఎఫ్ 2 సినిమాకు అత్యంత పాజిటివ్‌గా మారుతాయి అని అన్నారు. సంజయ్ దత్ ప్రస్తుతం కేజీఎఫ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా కన్నడలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను విజయ్ కిరంగదూర్ నిర్మించగా శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, వశిష్ట ఎన్ థామస్ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X