ఇల్లు ఖాళీ చేయాలంటూ స్టార్ హీరోకు షాకిచ్చిన కోర్టు!

By Bojja Kumar

సాండల్‌వుడ్ స్టార్ యష్‌కు కర్నాటక హైకోర్ట్ షాకిచ్చింది. కత్రిగుప్పెలోని బనశంకర్ 3వ ఫేజ్‌లో అతడు ఉంటున్న ఇంటి అద్దెబకాయిలు రూ. 23 లక్షలు చెల్లించాలని, లేక పోతే ఇల్లు ఖాళీ చేయాలని తేల్చి చెప్పింది. రెంటల్ అగ్రిమెంట్ యష్ తల్లి పుష్ప పేరు మీద ఉండటంతో ఈ మేరకు పుష్పలతకు నోటీసులు జారీ చేసింది.

డిసెంబర్ 31, 2018లోగా రూ. 23.27 లక్షలు చెల్లిస్తే మార్చి 31, 2019 వరకు అందులో ఉండొచ్చని, చెల్లించకుంటే ఇల్లు ఖాళీ చేయాలని సూచించింది. ఇంటి అద్దె, బకాయిపై వడ్డీ, డ్యామేజ్ అంతా కలిసి ఈ మొత్తం కోర్టు చెల్లించాలని సూచించినట్లు హౌస్ ఓనర్ మునిప్రసాద్, అతడి భార్య వనజా తరుపు లాయర్ ఎంటీ. నానయ్య తెలిపారు.

 Actor Yash’s mother asked to pay Rs 23 lakh rent dues or vacate house

ఈ ఇంటికి సంబంధించిన అద్దె వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. 2010, అక్టోబర్ 11న.... యష్ తల్లి పుష్పకు, ఇంటి ఓనర్ మునిప్రసాద్ మధ్య నెలకు రూ. 40వేల అద్దె చెప్పున అగ్రిమెంట్ జరిగింది. అయితే సరిగా అద్దె చెల్లించడం లేదంటూ 2015 నుండి వివాదం నడుస్తోంది.

క్రింది కోర్టు నుండి ఇష్యూ కర్నాటక హైరోర్ట్ వరకు వచ్చింది. హైకోర్ట్ డివిజన్ బెంచ్ జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ హరీష్ కుమార్ ఈ కేసులో యష్ తల్లి పుష్క రూ. 23 లక్షలు చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X