ఘనంగా మేఘనా రాజ్, చిరంజీవి సర్జా పెళ్లి.. సమంత, చైతూ మాదిరిగానే.. (వీడియో)
ప్రముఖ కన్నట నటి మేఘన రాజ్, చిరంజీవి సర్జా వివాహం ఆదివారం బెంగళూరులో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో జరిగిన పెళ్లి వేడుకకు కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లీ మే 2వ తేదీన హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అదే రోజు రిసెప్షన్ కూడా నిర్వహిస్తున్నారు.

పదేళ్లుగా స్నేహం, ప్రేమ
నటి మేఘనా రాజ్, చిరంజీవి సర్జా ఇద్దరు గత పదేళ్లుగా ఫ్రెండ్స్ గా ఉన్నారు. గత కొద్దికాలంగా ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకొన్నారు.

మేఘనతో స్నేహం, ప్రేమగా
తన పెళ్లి గురించి చిరంజీవి సర్జా మాట్లాడుతూ.. మేమిద్దరు చాలా కాలంగా ఫ్రెండ్స్‌గా ఉన్నాం. మా స్నేహం ప్రేమగా మారింది. అందుకే పెళ్లి చేసుకొన్నాం. మేఘనను పెళ్లి చేసుకోవడం గొప్ప అనుభూతి. మా పెళ్లికి పెద్దల ఆశీర్వాదం ఉంది అని అన్నారు.

పెళ్లి వేడుకలో భాగంగా
పెళ్లి వేడుకలో సంతోషంలో మునిగి తేలుతున్న నవదంపతులు.

పెళ్లి తర్వాత
మ్యారేజ్ అనంతరం వేదికపైన మేఘనా రాజ్, చిరంజీవి సర్జా

చర్చిలో మ్యారేజ్ అనంతరం మతపెద్ద ఎదుట ప్రమాణం చేస్తున్న మేఘన, చిరంజీవి
నవదంపతులను ఆశీర్వదిస్తున్న నటుడు అర్జున్. చిరంజీవి సర్జా ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు కావడం గమనార్హం. పెళ్లి వేడుకను అర్జున్ దగ్గరుండి చూసుకొన్నారు. అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్యలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల రిలీజైన లై చిత్రంలో కూడా విలన్‌గా నటించారు. మాపల్లెలో గోపాలుడు చిత్రం ద్వారా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.
చిరంజీవి సర్జా, మేఘన పెళ్లి వీడియో
చిరంజీవి సర్జా, మేఘన పెళ్లి వీడియో
డ్యాన్స్ చేస్తున్న మేఘన, చిరంజీవి
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మేఘనా రాజ్, చిరంజీవి సర్జా


Click it and Unblock the Notifications











