సీఎంతో పెళ్లి నా తలరాత.. అలా అంటే ప్రాణం పోతుంది.. సినీ నటి రాధిక కుమారస్వామి

కన్నడ నటి రాధిక సక్సెస్ జోష్ కొనసాగుతుండగానే సినీ వర్గాలకు షాకిచ్చి రాజకీయ వేత్త, ప్రస్తుత సీఎం హెచ్‌డీ కుమారస్వామి గౌడను వివాహం చేసుకొన్నది. అప్పటికే వివాహితుడైన కుమారస్వామిని పెళ్లి చేసుకోవడం సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. శివరాజ్ కుమార్, విజయ్ రాఘవేంద్ర లాంటి హీరోలతో నటిస్తూ దూసుకెళ్తున్న నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే పాపకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఇటీవల కన్నడ మీడియాకు ఇచ్చిన ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ రాజకీయాల్లో అనిశ్చిత నెలకొన్న సమయంలో రాధిక ఇంటర్వ్యూ వెలుగులోకి వచ్చింది. ఆమె ఏమన్నారంటే..

 కుమారస్వామిని పెళ్లి చేసుకోవడంపై

కుమారస్వామిని పెళ్లి చేసుకోవడంపై

కుమారస్వామితో పెళ్లి తర్వాత జీవితంలో ఎలాంటి మార్పులు లేవు. పెళ్లికి ముందు సినీ నటిగా పిలిచేవారు. ఇప్పుడు రాజకీయ నాయకుడి భార్య అని పిలుస్తున్నారు. రాజకీయ నేతను పెళ్లి చేసుకోవడం నా తలరాత. అలా పెళ్లి చేసుకోవడం ద్వారా తప్పు చేసిన ఫీలింగ్ కలుగడం లేదు అని రాధిక కుమారస్వామి అన్నారు. అయితే తాము విడిపోయామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని అన్నారు.

 అంతా దేవుడి తలరాత

అంతా దేవుడి తలరాత

రాజకీయ నేత కుమారస్వామిని పెళ్లి చేసుకోవడం ద్వారా సినిమాలకు దూరమయ్యాను. ఎవరినీ, ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకోవడమనేది మన చేతిలో ఉండదు. అదంతా దేవుడు రాసిన తలరాత. ఆయనతో నా వైవాహిక జీవితం సంతోషంగా సాగుతున్నది. నాకు ఎలాంటి తప్పు చేశాననే భావన ఎన్నడూ కలుగలేదు అని రాధిక కుమారస్వామి తెలిపారు.

కుమారస్వామి పేరు పలకకపోవడంపై

కుమారస్వామి పేరు పలకకపోవడంపై

తాను కుమారస్వామి పేరును పలకకపోవడంపై కూడా వివరణ ఇచ్చారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించినంత వరకు భర్త పేరును భార్య పలుకరు. ఒకవేళ అలా పలికితే ఆయుష్షు తగ్గిపోతుంది. అందుకే నేను ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడను. ఇంటర్వ్యూలో నా భర్త పేరు చెప్పడానికి ఒప్పుకోను అని రాధిక కుమారస్వామి చెప్పారు.

సినిమాల్లో మళ్లీ బిజీ, బిజీగా

సినిమాల్లో మళ్లీ బిజీ, బిజీగా

ఇప్పటికీ రాధిక, కుమారస్వామి రిలేషన్ విషయంపై మీడియాలో అనేక అనుమానాలు తలెత్తుతుంటాయి. వారిద్దరికి షమిక అనే కూతురు ఉంది. ఈ మధ్యకాలంలో వారిద్దరు కలిసి ఎక్కడ కనిపించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో వారి మధ్య బ్రేకప్ జరిగిందనే రూమర్లు షికారు చేశాయి. అయితే వారిద్దరూ ఎన్నడూ ఆ వార్తను ఖండించకపోవడం గమనార్హం. కుమారస్వామి రాజకీయాలతో బిజీగా మారడంతో రాధిక మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X