వైరాగ్యంలో సీనియర్ నటి.. ఎవరికి చెప్పాకుండా ఝలక్.. ఇంటిని ఖాళీ చేసి..!

కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య మరోసారి కర్ణాటక వాసులకు ఝలక్ ఇచ్చింది. సొంత జిల్లా మాండ్యలోని ఇంటిని అర్ధరాత్రి ఎవరికీ చెప్పపెట్టకుండా ఖాళీ చేయడం మీడియాలో ప్రముఖంగా మారింది. మండ్యా లోక్‌సభ సీటును ఇవ్వకపోవడంతో అనూహ్యంగా రమ్య ఈ నిర్ణయం తీసుకొన్నదని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల వల్ల వైరాగ్యం చెందారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే..

వివాదంలో నటి రమ్య

వివాదంలో నటి రమ్య

ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ నేత అంబరీష్ మృతి నేపథ్యంలో నటి రమ్య వివాదంలో కూరుకుపోయారు. తన గురువులాంటి అంబరీష్‌ను చివరి చూపుకు కూడా రాకపోవడంపై రమ్యపై నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాజరుకాలేదని రమ్య స్పష్టం చేశారు.

రమ్యకు షాక్ మీద షాక్

రమ్యకు షాక్ మీద షాక్

అంబరీష్ అంత్యక్రియలను హాజరుకాని విషయంపై పార్టీ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాండ్య సీటును దక్కించుకోవాలని ఆశపడ్డారు. కానీ పొత్తులో భాగంగా సీటును జేడీఎస్‌కు ఇవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మాండ్య ఎంపీ స్థానాన్ని జేడీఎస్‌కే వదిలేయనున్నట్లు తెలియడంతో రమ్య షాక్ తిన్నట్టు కథనాలు వెలువడ్డాయి.

రాత్రికి రాత్రే ఇంటిని ఖాళీ

రాత్రికి రాత్రే ఇంటిని ఖాళీ

మాండ్య జిల్లాలో ఎదురు దెబ్బలు తగలడంతో రమ్య రాత్రికి రాత్రే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. మాండ్యలోని కేఆర్‌ఎస్‌ రోడ్‌లో మాజీ ఎమ్మెల్యే సాదత్‌ అలీఖాన్‌ ఇంటిలో ఆమె అద్దెకు ఉండేవారు. ఆకస్మికంగా ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని సామాన్లు రెండు లారీల్లో బెంగళూరుకు తరలించారు.

రమ్య ఓటమి కారణంగా

రమ్య ఓటమి కారణంగా

2013లో మాండ్య‌ లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో రమ్య గెలిచారు. మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కొద్దికాలం మాండ్యలోనే ఉన్నారు. కొద్దికాలం క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రమ్యను ఏఐసీసీ సోషల్‌ మీడియా చీఫ్‌గా నియమించడంతో రమ్యకు, రాష్ట్రానికి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. విధానసభ, లోక్‌సభ ఉపఎన్నికల్లో ఓటు వేయడానికి రాకుండా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X