Just In
- 36 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జైలు నుంచి విడుదలైన తరువాత బుజ్జిగాడు హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
ఒక సినిమా హిట్టయితే కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంటుంది. అయితే ఈ రోజుల్లో ప్లాప్ దెబ్బ పడినా కూడా కొందరు నటీమణులు చాలా ఈజీగా అవకాశాలు అందుకుంటున్నారు. టాలెంట్ ఉంటే చాలు సినిమా ఛాన్సులు అవంతట అవే వస్తాయని కొంతమంది నటీమణులు నీరూపిస్తున్నారు. అయితే సంజన గల్రానీ కూడా మొదట్లో అలానే క్లిక్కవుతుందని అంతా భావించారు. కానీ ఆమె అనుకోకుండా అనేక రకాల వివాదాల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఆ సినిమా ద్వారా క్లిక్కవ్వడంతో..
మొదట సంజన తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమా ద్వారానే. ఆ సినిమా హిట్ అవ్వకపోయినా కూడా సంజన గ్లామర్ కు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత మెల్లగా ఇతర అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేసింది. తమిళ్, కన్నడలో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.

ఆ ఒక్క కేసు వలన..
అయితే గత ఏడాది సంజన డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ ఒక్క కేసు వలన ఆమెపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ బెట్టింగ్ లలో కూడా ఆమె పేరు ఉన్నట్లు కన్నడ మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే అక్రమాస్తులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులకు కూడా ఆమె బినామీ అన్నట్టు రూమర్స్ వచ్చాయి.

కావాలని టార్గెట్ చేశారని..
ఇక మొత్తానికి సంజన గత ఏడాది డిసెంబర్ 13న బెయిల్ పైన జైలు నుంచి బయటకు విషయం తెలిసిందే. ఆ రోజు బయటకు వచ్చిన తరువాత సంజన చాలా ఎమోషనల్ అయ్యింది. అన్యాయంగా తనను ఈ కేసులలో ఇరికించారని కావాలనే టార్గెట్ చేశారని కూడా ఆమె సన్నిహితులకు చెప్పుకున్నట్లు తెలిసింది.

మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని
ఇక కొన్ని రోజుల వరకు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకున్న సంజన మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని అనుకుంటోంది. లాక్ డౌన్ కంటే ముందే ఆమె కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. అలాగే రీసెంట్ గా ఒక తమిళ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక నుంచి నటిగా బిజీ అవ్వాలని మళ్ళీ తనను తాను నిరూపించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.