హీరోయిన్ సంజనా గల్రానీ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి బుజ్జిగాడు హీరోయిన్

డ్రగ్స్ రాకెట్ కేసులో దక్షిణాది నటి సంజనా గల్రానిని కన్నడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజల నుంచి కన్నడ పరిశ్రమ ప్రముఖులకు ఉన్న డ్రగ్స్ సంబంధాలపై ఆరా తీస్తూ దాడులు నిర్వహిస్తున్న క్రైం బ్రాంచ్ విభాగం ఇటీవల సంజనా సహాయకుడు రాహుల్‌ను అరెస్ట్ చేయడంతో సంచలనం రేపింది. ఈ క్రమంలో సంజనాకు సమన్లు జారీ చేసి విచారిస్తారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఊహించని రీతిలో సంజనా నివాసాలపై మంగళవారం ఉదయం దాడుల నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో

కన్నడ డ్రగ్ రాకెట్ కేసులో

కన్నడ డ్రగ్ రాకెట్ కేసులో

కన్నడ పరిశ్రమకు డ్రగ్ రాకెట్ లింకు కేసులో సంజనా గల్రానీ పేరు బయటకు రావడంతో దక్షిణాదిలో సెన్సేషనల్‌గా మారింది. తన సహాయకుడు, రాఖీ బ్రదర్ రాహుల్‌‌ను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దాంతో రెండు రోజులుగా ఆమెకు సమన్లు జారీ చేస్తారని కొందరు, అరెస్ట్ కావడం ఖాయమని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మంగళవారం అదుపులోకి తీసుకొని

మంగళవారం అదుపులోకి తీసుకొని

కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ కూపీ లాగుతున్న పోలీసులకు సంచలన విషయాలు దృష్టికి వచ్చాయి. ఆ తర్వాత సంజన పాత్రను ధృవీకరించుకొన్న తర్వాత ఆమె నివాసంపై మహిళా పోలీసుల సహాయంతో దాడులు, సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని రోజంతా విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు.

సంజనాకు వైద్య చికిత్స, పోలీస్ కస్డడీ

సంజనాకు వైద్య చికిత్స, పోలీస్ కస్డడీ

అరెస్ట్ తర్వాత సంజనాను వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమెను ఏసీఎంఎం కోర్టులో ప్రవేశపెట్టారు. దాంతో ఆమెకు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొన్నారు.

సంజనా అరెస్ట్‌తో కలకలం

సంజనా అరెస్ట్‌తో కలకలం

డ్రగ్ రాకెట్ వ్యవహారంలో సంజనా అసిస్టెంట్ రాహుల్‌ను అరెస్ట్ కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్ట్ కావడంతో డ్రగ్స్ కేసు తీవ్రతరమైంది. ఈ క్రమంలో తనకు ఎలాంటి సంబంధాలు లేవని సంజనా బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఊహించని విధంగా రాహుల్ చెప్పిన విషయాల ఆధారంగా సంజనా అరెస్ట్ ఖాయమైందనే వాదన పోలీసు వర్గాల్లో వినిపించింది.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
 గతేడాది దాడి ఘటన సంజనా అరెస్ట్‌కు బీజం

గతేడాది దాడి ఘటన సంజనా అరెస్ట్‌కు బీజం

గతేడాది డిసెంబర్ 24వ తేదీన ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో దాడి ఘటనను బెంగళూరు పోలీసులు తిరగదోడగా సంజనా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినట్టు సమాచారం. నిర్మాత వందన జైన్‌పై దాడి చేసిన ఘటనలో పలు విషయాలు బయటపడినట్టు తెలిసింది. పార్టీలో డ్రగ్స్ భారీగా వినియోగించినట్టు రాహుల్‌ను విచారించగా పలు విషయాలు బయటపడినట్టు సమాచారం. అలాగే తాజా సోదాల్లో ఆమె నుంచి స్వాధీనం చేసుకొన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌లో పలు ఫోటోలు, వీడియోలను కూడా గుర్తించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X