ప్రముఖ హీరోయిన్ గర్బవతి.. సీనియర్ నటుడిపై లైంగిక వేధింపుల నేపథ్యంలో..

Recommended Video

Actress Sruthi Hariharan Announces Pregnancy On Instagram || Filmibeat Telugu

ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్ గర్భవతి అనే విషయం దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఫొటో మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ట్రెండింగ్‌గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు తల్లి కాబోతున్న ఆమెకు శుభాకాంక్షలు వెల్లడించారు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎక్కువగా మీడియాకుతెలియజేయకుండా వ్యవహరించడంపై శృతి హరిహరన్ క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

ఎందుకు దూరం అయ్యానంటే

ఎందుకు దూరం అయ్యానంటే

దక్షిణాది చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్నాను. కారణం నేను మొదటిసారి గర్భం దాల్చడం వల్ల నాకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం అయ్యాయి. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో మీడియాకు, సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్రత్త పడ్డాను. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ను. త్వరలోనే నా ప్రపంచంలోకి ఓ బుల్లి చిన్నారిని ఆహ్వానించబోతున్నాను అని శృతి పేర్కొన్నారు.

 నా ప్రపంచంలోకి ఆహ్వానం

నా ప్రపంచంలోకి ఆహ్వానం

తన ప్రెగ్నెన్సీ వివరాలను ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో శృతి హరిహరన్ వెల్లడించారు. అస్పష్టంగా ఉన్న ఫోటోలో పైకి ఉబ్బి ఉన్న గర్బంతో ఉన్న చిత్రాన్ని పోస్టు చేశారు. నీ జీవంతోపాటే నా గుండె కొట్టుకొంటున్నది. నా జీవితంలో కొత్త ప్రయాణం మొదలు కాబోతున్నది. కొన్నిసార్లు అస్పష్టత జీవితంలో కీలక అంశానికి కేంద్రంగా మారుతుంది. నా చిన్నారిని సర్కస్ లాంటి ప్రపంచంలోకి ఆహ్వానించాలని అనుకొంటున్నాను అని శృతి హరిహరన్ అన్నారు.

 పెళ్లి విషయంలో గుప్పుమన్న రూమర్లు

పెళ్లి విషయంలో గుప్పుమన్న రూమర్లు

పెళ్లి విషయంలోనూ శృతి హరిహరన్ సీక్రెట్‌గానే వ్యవహరించింది. రామ్ కుమార్‌ను పెళ్లాడారనే వార్త మీడియాలో గుప్పుమనడం, రూమర్లు వైరల్‌గా మారడం లాంటి అంశాలతో గందరగోళం నెలకొన్నది. అయితే సీనియర్ హీరో అర్జున్ సర్జాపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.ఆ సమయంలో చేసిన ఫిర్యాదులో తాను వివాహితురాలని పేర్కొనడంతో శృతి పెళ్లి విషయం బయటపడింది.

 హీరో అర్జున్‌ సర్జాపై లైంగిక ఆరోపణలు

హీరో అర్జున్‌ సర్జాపై లైంగిక ఆరోపణలు

ఇక శృతి హరిహరన్ లైంగిక ఆరోపణల విషయంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ అర్జున్ భగ్గుమన్నారు. వాస్తవాలుంటే రుజువు చేయాలని శృతికి సవాల్ విసిరారు. తనపై ఫిర్యాదు చేసిన ఆమెపై సుమారు రూ.5 కోట్ల పరువు నష్టం దావాను దాఖలు చేశారు. ఈ ఇద్దరి మధ్య వివాదం దక్షిణాదిలో సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X