ఆమె పిరికితనంతో పారిపోయింది, నేనలా కాదు.. చక్కెరలా ఉన్నానని!

సీనియర్ హీరో అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శృతి హరిహరన్ చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటోంది. అర్జున్ తనని వేధించినట్లు ఆధారాలతో సహా బయట పెడతానంటూ శృతి హరిహరన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే శృతి హరిహరన్ అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజగా శృతి హరిహరన్ మహిళా కమిషన్ ముందు కూడా ప్రత్యక్షమైంది. శృతి హరిహరన్ కేసుని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే.

పిరికితనంతో పారిపోయింది

పిరికితనంతో పారిపోయింది

మహిళ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన శృతి హరిహరన్ మీడియాతో విచారణ సారాంశాన్ని వివరించింది. చాలా రోజులుగా విచారణకు రమ్మని మహిళా కమిషన్ చైర్మన్ నాగ లక్ష్మి శృతి హరిహరన్ ని కోరుతున్నారు. కానీ వ్యక్తిగత కారణాలవలన ఇన్నిరోజులు విచారణకు హాజరు కాలేకపోయానని శృతి హరిహరన్ తెలిపింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు తనతో చర్చించిన తీరు సంతృప్తిగా ఉందని శృతి తెలిపింది.

ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి

ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి

నాగలక్ష్మి తనని ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి విచారించారు. అర్జున్ వలన తాను ఎదుర్కన్న లైంగిక వేధింపులన్నీ ఆమెకు వివరించాను. నా వాంగ్మూలాన్ని ఆమె రికార్డ్ చేసుకున్నారు. మహిళా కమిషన్ తనకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో ఉన్నానని శృతి తెలిపింది. లైంగిక వేధింపులకు సంబందించిన విషయాలు పోలీసులకుగాని, మహిళా కమిషన్ కు కానీ తెలియజేయాలి. సోషల్ మీడియాలో పబ్లిక్ గా ప్రస్తావించడం తగదని ఆమె తనకు సూచించినట్లు శృతి మీడియాకు తెలిపింది.

 పిరికితనంతో పారిపోయింది

పిరికితనంతో పారిపోయింది

ఈ సందర్భంగా శృతి హరిహరన్ మరో హీరోయిన్ సంజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యమం నుంచి సంజన పిరికితనంతో పారిపోయింది. ఆమె అలా చేయడం తనకు బాధ కలిగించిందని శృతి తెలిపింది. కానీ తాను మాత్రం ప్రాణ హాని ఉందని తెలిసినా వెనకడుగు వేయమని తేల్చి చెప్పింది. సినిమా రంగంలో ఉన్న ప్రతి మహిళ ఎదో విధంగా వేధింపులకు గురవుతూనే ఉన్నారు అంటూ శృతి పేర్కొంది.

చక్కెరలా ఉన్నాను

చక్కెరలా ఉన్నాను

ఈ సందర్భంగా శృతి మీడియాపై కూడా జోకులు పేల్చింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి మీరంతా వస్తున్నారు. మీరంతా నా వెంట చీమలలాగా వెంట పడుతున్నారు. నేను చక్కెరలా ఉన్నాను అంటూ సెటైర్లు వేసింది. నాకు మీడియా అంటే గౌరవం ఉంది. కేసు కొనసాగతూ ఉండడం వలన అన్ని విషయాలు మాట్లాడడం కుదరదు అని వెళ్ళిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X