KGF యష్ జీవితాన్నే మార్చేసిన ఆ దర్శకుడు, ఇప్పుడు మరొక కుర్రాడితో.. 20ఏళ్ళ తరువాత జయం రీమేక్
కన్నడ సినిమా పరిశ్రమకు ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ ఆ ఇండస్ట్రీ స్థాయి నేషనల్ లెవెల్లో పెరగడానికి చాలా సమయం పట్టింది. ఒక బస్ డ్రైవర్ కొడుకు KGF లాంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్లాస్ట్ చేస్తాడని ఎవరు ఊహించలేదు. హీరో యష్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టడానికి కారణం ఒక సీనియర్ దర్శకుడు. ఇక అలాంటి దర్శకుడి నుంచి ఇప్పుడు మరొక పవర్ఫుల్ కుర్రాడు రాబోతున్నట్లు కన్నడ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

యష్ కు మొదటి ఛాన్స్
యష్ అవకాశాల కోసం కెరీర్ మొదట్లో ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ ఎక్కడికెళ్లినా కూడా అతని మొహం ఏ మాత్రం బాగాలేదని హేళన చేసేవారట. కానీ యష్ ప్రయత్నాలు ఆపకుండా సీనియర్ డైరెక్టర్ శశాంక్ ను కలిశాడు. ఇక యష్ లో ఉన్న కసిని అతను గమనించి మొగ్గిన మనసు అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

యష్ గాడ్ ఫాదర్ అతనే..
యష్ ఎంతో కాలంగా ఓపికతో ఎదురుచూసిన అవకాశం ఒక్క పరిచయంతోనే దక్కడంతో శశాంక్ ను అతను గాడ్ ఫాదర్ లా చూస్తాడు. ఆ దర్శకుడు కేవలం యష్ తోనే కాకుండా పునీత్ రాజ్ కుమార్, సుదీప్ కిచ్చా వంటి హీరోలతో కూడా సక్సెస్ ఫుల్ సినిమాలు తీశాడు. ఇక ఇప్పుడు అందరి చూపు అతను పరిచయం చేయబోయే కొత్త కుర్రాడిపైనే పడింది.

కొత్త కుర్రాడితో న్యూ మూవీ.. తెలుగులో కూడా
యష్ తరహాలోనే అవకాశాల కోసం గత రెండు మూడేళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్న ప్రవీణ్ తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే యాక్టర్ అవ్వాలని అనుకున్నడట. ఇక మొత్తానికి ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ తో అతన్ని భారీ స్థాయిలో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఆ కుర్రాడు మంచి ఫిట్నెస్ తో కనిపిస్తున్నాడు. తెలుగులో కూడా ఆ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

20 ఏళ్ళ తరువాత జయం
తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన జయం సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నితిన్ ఆ సినిమాతోనే కెరీర్ ను స్టార్ట్ చేశాడు. ఇక ప్రవీణ్ అనే ఈ కొత్త కుర్రాడు మరొక కన్నడ దర్శకుడితో జయం సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఆ సినిమా 2022లో రావచ్చని టాక్. మరి ఈ కొత్త హీరో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











