కేజీఏఫ్ హీరోలో మరో సైడ్ కూడా ఉందట... మా మంచి నాన్న అంటోన్న ఫ్యాన్స్
కేజీఏఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో యష్, ఇప్పుడు ఏ చిన్న పని చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. కేజీఎఫ్ పార్ట్ 2 కోసం కళ్ల కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో సోషల్ మీడియా సందడి చేసే యష్, తాజాగా మరో వీడియోతో అభిమానులను మురిపించాడు.
లాక్ డౌన్ కాలంలో పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించిన యష్ పిల్లలతో కలసి ఆటపాటల్లో మునిగితేలుతున్నాడు. ఇక తన ఆరు నెలల కుమారుడి గురించి ముచ్చట్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అందరినీ మురిపిస్తున్నాడు. చిన్నారిని ముద్దుగా జూనియర్ యష్ అని సంబోధించుకుంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ బుడతడు అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించేసుకున్నాడు.

ఇక తాజాగా యష్ పోస్ట్ చేసిన వీడియోలో చిన్నారి యష్ తన ఫేవరేట్ రైమ్ కు డాన్స్ చేస్తూ దర్శనమిచ్చాడు. అబ్బాయి డాన్స్ కు యష్ సైతం కదం కలిపినప్పటికీ, అతడు వీడియోలో దర్శనమివ్వలేదు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ హడావిడి నాన్నను క్షమించండి అన్నాడు. దీనికి అభిమానులు ఏ రేంజ్ లో స్పందించి ఉంటారో ఇక ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదనుకుంటా.


Click it and Unblock the Notifications











