Puneeth Rajkumar ను తలుచుకొని అల్లు అర్జున్ ఎమోషనల్.. ఆ కుటుంబాన్ని ఇప్పుడు కలవడం ఇష్టం లేదంటూ కామెంట్
పుష్ప సినిమా ప్రమోషన్స్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోష్‌తో కనిపించారు. బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. వేదిక మీదకు చేరుకొన్న ఐకాన్ స్టార్ కన్నడ భాషలో నమస్కారం తెలిపి ఆకట్టుకొన్నారు. పుష్ప సినిమాకు ఇస్తున్న సపోర్ట్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మీరు చూపిస్తున్న ఆదరణకు తెలుగు సినిమా పరిశ్రమ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.
పుష్ప ప్రమోషన్స్ కోసం బెంగళూరుకు ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నతనంలో నేను బెంగళూరుకు వస్తూ ఉండేవాడిని. 18 ఏళ్ల వయసులో నేను ఏ రేంజ్‌కు ఎదుగుతానని, నా సినిమాలను కన్నడ ప్రేక్షకుల ఆదరిస్తారని ఊహించలేదు అని అల్లు అర్జున్ చెప్పారు. డిసెంబర్ 17న రిలీజ్ పుష్ప రిలీజ్ అవుతున్నది. ఇక తగ్గేదిలేదు.. ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లిన డిస్టిబ్యూటర్లకు థ్యాంక్స్ అని అన్నారు.

పుష్ప రిలీజ్ నేపథ్యంలో రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కన్నడ ప్రజలు గర్వపడే విధంగా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారారు. ఇతర భాషల్లో కూడా మంచి విజయాలను అందుకొంటున్నారు. అలాగే హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. మొత్తానికి రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. అందుకు రష్మిక కంగ్రాట్స్. ఓ మంచి పని చేస్తే ఆ అమ్మాయిది ఏ ఊరు అని అడుగుతారు. రష్మిక గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. కన్నడ అమ్మాయిగా ప్రజలు గర్వపడుతున్నారు అన్నారు.
పునీత్ కుమార్ మరణంతో నేను చాలా విషాదానికి, దిగ్బ్రాంతికి గురయ్యాను. పుష్ప షూటింగ్ బిజీ కారణంగా నేను ఆయన అంత్యక్రియలకు రాలేదు. పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని ఇప్పుడు వెళ్లి కలిసి పరామర్శించడానికి అవకాశం ఉంది. కానీ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చి కలవడం బాగుండదు. మరోసారి బెంగళూరుకు వచ్చి నేను వారిని కలుస్తాను. పునీత్ కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్‌కుమార్ విషయానికి వస్తే.. కన్నడ పరిశ్రమలో సూపర్‌స్టార్, పవర్ స్టార్‌గా పేరున్న హీరో అక్టోబర్ 29, 2021న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రముఖులు తల్లడిల్లిపోయారు. ఆయన మరణంతో కన్నడ ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











