మరో భారీ అప్డేట్ ఇవ్వబోతున్నా KGF నిర్మాతలు
KGF చాప్టర్ 1తో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. నెక్స్ట్ చాప్టర్ 2తో ఈ సంస్థ మరో భారీ హిట్ అందుకోవడం కాయంగా కనిపిస్తోంది. యష్ హీరోగా నటించిన ఆ సినిమా వల్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పెద్ద హీరోలను టార్గెట్ చేసే స్థాయికి వచ్చాడు. ప్రస్తుతం సలార్ ను కూడా అదే టీమ్ తో రెడీ చేస్తున్నారు. ఆ సినిమా హిట్టయితే KGF నిర్మాత విజయ్ కిరగందుర్ అంతకుమించి అనేలా సినిమాలు చేయడం కాయం.
ఇక ఆ తరువాత రాబోయే భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా భారిగానే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మరొక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వబోతున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఒక సినిమా చేయడానికి డీల్ సెట్ చేసుకున్న హోంబలే ఫిలిమ్స్ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయడానికి సిద్ధమైంది. జూలై 1న ఉదయం 11:46కు సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. పవన్ కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఇదివరకే ఈ కాంబినేషన్లో యువరత్న సినిమా వచ్చింది. ఆ సినిమాను తెలుగులో కూడా గట్టిగానే రిలీజ్ చేశారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ మళ్ళీ అదే తరహాలో ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక హోంబలే ఫిలిమ్స్ నుంచి సలార్ అనంతరం భగీరా అనే సినిమాతో రాబోతోంది. ఆ సినిమాలో శ్రీమురలి హీరోగా నటిస్తున్నాడు. శ్రీ మురళి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు దగ్గరి బంధువు.


Click it and Unblock the Notifications











