డ్రగ్స్ కేసు తరువాత ఆన్‌లైన్ బెట్టింగ్.. ఆ స్టార్ హీరోయిన్‌పై మరో అనుమానం?

కన్నడ సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని వారాలుగా డ్రగ్స్ వివాదం ఏ స్థాయిలో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొదటి సారి డ్రగ్స్ కేసు ఆ సినిమా ప్రపంచంలో ఊహించని అలజడిని రేపింది. ఇక అనేక రకాల ఆరోపణలతో స్టార్ హీరోయిన్స్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. బలమైన సాక్ష్యాలు ఉండడం వల్లనే సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు డ్రగ్స్ వాడినట్లు గాని, సరఫరా చేసినట్లు గాని ఇంతవరకు నేరం ఋజువు కాలేదు. కానీ రోజుకో అనుమానం హాట్ టాపిక్ టాపిక్ గా మారుతోంది.

బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు

బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు

ఇటీవల డ్రగ్స్ కేసులోనే బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి బెయిల్ లబించిన విషయం తెలిసిందే. ఇక సంజన, రాగిణీ కుటుంబ సభ్యులు కూడా గట్టిగానే పోరాటం చేస్తున్నారు. కేవలం హీరోయిన్స్ ని టార్గెట్ చేయడం ఏమిటని మరోవైపు మహిళా సంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇక కేసు నమోదైన రోజు నుంచే హీరోయిన్స్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ న్యాయస్థానం నుంచి ఊహించని షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు వేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్.. కోట్ల విలువైన ఆస్తులు

ఆన్‌లైన్ బెట్టింగ్.. కోట్ల విలువైన ఆస్తులు

ఇక మరోసారి ఆస్తుల లెక్కలు కూడా సంజనను తీవ్ర ఇబ్బందులోకి నెట్టే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సంజనాకు బెంగుళూరు శివార్లలో కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఇప్పటికే కన్నడ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు, ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా సంజనా కోట్ల రూపాయల డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది.

నెట్‌వర్క్‌ను అలా ఉపయోగించి..

నెట్‌వర్క్‌ను అలా ఉపయోగించి..

తనకున్న పరిచయాల ద్వారా నెట్‌వర్క్‌ను మొత్తం బెట్టింగ్ కోసం ఉపయోగించుకుందని అక్రమంగా డబ్బును కూడా సంపాదించిందట. కర్ణాటకలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి షాకింగ్ న్యూస్ వెలువడినట్లు వార్తలు ఆయితే గట్టిగానే వస్తున్నాయి. ఇక అధికారులు అన్ని కోణాల్లో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్క అనుమానం ఉన్నా కూడా వదిలి పెట్టడం లేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ అనుమానాలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
ఆ స్టార్ హీరోలు ఎవరు?

ఆ స్టార్ హీరోలు ఎవరు?

సంజనా, రాగిణి అరెస్ట్ అయినప్పటి నుంచి కన్నడ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు స్టార్ హీరోలకు డ్రగ్స్ డీలర్స్ తో సంబంధాలు ఉన్నాయని అంతే కాకుండా వారు వారానికోసారి హెవీ డోస్ లో డ్రగ్స్ తీసుకుంటారని కథనాలు వస్తున్నాయి. దీంతో ఆ స్టార్ హీరోలు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X