విడాకుల కోసం స్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో బయటపడ్డ విభేదాలు

కన్నడ స్టార్ హీరో దర్శన్ దంపతులు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్టు ఓ వార్త దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారింది. కొద్దికాలంగా వారిద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే విషయం మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా‌కు సంబంధించిన వ్యవహారం వారిద్దరు విడిపోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఇరు వర్గాల నుంచి ఈ వార్తపై ఎలాంటి ఖండన రాకపోవడం మరింత చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ సోషల్ మీడియా వ్యవహారం ఏమిటంటే..

 ట్విట్టర్‌లో అన్ ఫాలో కావడంతో

ట్విట్టర్‌లో అన్ ఫాలో కావడంతో

కొద్ది రోజులు హీరో దర్శన్, ఆయన సటీమణి విజయలక్ష్మీ దర్శన్ విడిపోతున్నారనే వార్త ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. తాజాగా ట్విట్టర్‌లో ఈ దంపతులు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం మీడియాలో క్రేజీగా మారింది. ఈ అంశంపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే మరోవైపు తన ట్విట్టర్ అకౌంట్‌లో తన పేరు నుంచి దర్శన్ తొలగించడం మరింత సంచలనంగా మారింది. దాంతో స్టార్ దంపతులు విడిపోవడం ఖాయం అనేది స్పష్టమైంది.

వివాహిక జీవితం గురించి

వివాహిక జీవితం గురించి

అయితే తమ వైవాహిక జీవితానికి సంబంధించిన అంశంపై వస్తున్న వార్తలపై విజయలక్ష్మీ స్పందించారు. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఏవైనా వార్తలు వెలుగు చూస్తే అందంతా అవాస్తవమే అని విజయలక్ష్మీ ట్వీట్ చేశారు. కాగా దర్శన్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఇంకా ఏదో జరుగుతున్నదనే మాట కన్నడ మీడియాలో వినిపించింది.

 సోషల్ మీడియాలో మౌనంగా విజయలక్ష్మీ

సోషల్ మీడియాలో మౌనంగా విజయలక్ష్మీ

కొద్ది నెలల క్రితం దర్శన్ నటించిన కురుక్షేత్రం సినిమాకు సంబంధించిన విషయాలను, ఫోటోలను విస్తృతంగా షేర్ చేశారు విజయలక్ష్మీ. కానీ సినిమాకు ముందు వాటిని షేర్ చేయడం నిలిపివేశారు. దాంతో వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతోనే విజయలక్ష్మీ ఇలా స్పందించారనే మాట వినిపించింది. కాగా ఇలాంటి వార్తల మధ్య దర్శన్ మామూలుగానే ఉన్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్‌లో పాల్గొనడమే కాకుండా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

స్టార్ హీరోయిన్ రాయబారం ఫలించేనా

స్టార్ హీరోయిన్ రాయబారం ఫలించేనా

కాగా, దర్శన్‌కు సన్నిహితుడైన నిర్మాత ఒకరు ఇటీవల మీడియాతో ఓ విషయాన్ని పంచుకొన్నారు. దర్శన్ దంపతుల మధ్య వివాదం ఉందో లేదో తెలియదు కానీ.. వారి గురించి ఏ నటీనటుడైనా స్పందించకుండా ఉంటే మంచింది అని సూచించారు. ఇదిలా ఉండగా, దర్శన్ దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రముఖ నటి రాయబారం నడిపారట. వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు ఇద్దరితోనే మాట్లాడారని కన్నడ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, దర్శన్ నటించిన కురుక్షేత్రం మూవీ భారీ వసూళ్లను నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X