#మీటూ: అర్జున్-శృతి హరిహరన్ గొడవలో ట్విస్ట్, రూ. 5 కోట్లకు....
కన్నడనాట సంచలనం క్రియేట్ చేసిన ప్రముఖ నటుడు అర్జున్ సార్జా, హీరోయిన్ శృతి హరిహరన్ మీటూ వివాదం కొత్త మలుపు తిరిగింది. వీరి వివాదం పెద్దదవుతుండటం, ఇండస్ట్రీలో కొందరు అర్జున్ వైపు, మరొకొందరు శృతి హరిహరన్‌కు మద్దతుగా మాట్లాడటంతో వీరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ఇందులో రాజీపడటానికి ఏముందని? అర్జున్ మీద అసత్య ఆరోపణలు చేసిన శృతి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఆయన మద్దతు దారులు అంటున్నారు. తాజాగా శృతి హరిహరన్ మీద రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా దాఖలైంది.

కేసు వేసిన ధృవ్ సార్జా
శృతి హరిహరిన్ మీద అర్జున్ సార్జా తరుపున ఆయన మేనల్లుడు ధృవ్ సార్జా రూ. 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది.

ఇంకెన్ని మలుపులో...?
అయితే శృతి హరిహరన్‌కు ప్రకాష్ రాజ్‌తో పాటు మరికొందరు నటీనటుల మద్దతు లభించడంతో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది.

ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే...
‘శ్రుతి టాలెంట్ ఉన్న నటి. ఆమెకు నాతో పాటు, ఇతర కళాకారుల మద్దతు ఉంటుంది. అర్జున్ ఇప్పటికైనా మేల్కొని ఆమెకు బహిరంగ క్షమాపణలు చెబితే మంచిది. ఆయన అలా చేశారా? లేదా.. అన్నది నేను చూడలేదు. నటి చేసిన ఆరోపణలను అర్జున్ ధైర్యంగా స్వీకరించాలి. రిహార్సల్ సమయంలో వీపును తడిమిన విషయంలో ఆమె చేసిన ఆరోపణలకు అర్జున్ సమర్థించుకునే బదులుగా, క్షమాపణలు చెబితే బావుంటుంది' అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

శృతి హరిహరన్
కన్నడ చిత్రం విస్మయ (తెలుగులో ‘కురుక్షేత్రం) చిత్రీకరణ సమయంలో ఒక రొమాంటిక్ సీన్ రిహార్సల్ సమయంలో అర్జున్ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, తన అనుమతి లేకుండానే దగ్గరకు లాక్కుని వీపు మీద కింద నుంచి పై వరకు అసభ్యంగా టచ్ చేశాడని శృతి హరిహరన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











