ఆషికా రంగనాథ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. కజిన్ సూసైడ్ వెనుక దారుణమైన వేధింపులతో
యువ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. తనకు అత్యంత ఇష్టమైన కజిన్ అచలా హర్ష ఆత్మహత్యాకు పాల్పడి ప్రాణాలు తీసుకోవడం అత్యంత దిగ్బ్రాంతిని కలిగించింది. తన ప్రియుడి నుంచి వచ్చిన వేధింపులను భరించలేక ఇటీవల బెంగళూరులోని పాండురంగా నగర్‌లోని బంధువుల ఇంటిలో సూసైడ్ చేసుకొని తుదిశ్వాస విడిచారు. దాంతో ఫ్యామిలీ, స్నేహితులు సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కుటుంబంలో జరిగిన విషాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆషికా రంగనాథ్ కుటుంబ సభ్యులు వెల్లడించిన ప్రకారం.. అచలా తీసుకొన్న నిర్ణయం ఒక్కరోజులో కాదు. కొన్ని నెలలుగా తీవ్రమైన క్షోభను ఆమె అనుభవిస్తున్నారు. ఆ బాధను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. వేధింపులు, దూషణ, మోసం లాంటి విషయాల వల్ల మనస్తాపం చెందిన ఆమె మరణానికి పాల్పడ్డారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అచలా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. తమ దూరం బంధువు మయాంక్ గౌడతో తన కూతురు రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆయన డ్రగ్ ఎడిక్ట్. తొలుత ప్రేమించమని బలవంతం చేశాడు. ఆ తర్వాత పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకోమని తీవ్రమైన ఒత్తిడి చేశారు. అందుకు నా కూతురు ఒప్పుకోకపోవడంతో మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సూసైడ్‌కు ముందు నిరంతరం కాల్స్ చేసి బెదిరించాడు. అనేక రకాలుగా వేధించాడు. రకరకాలుగా బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొన్నాడు. దానిని అచల వ్యతిరేకించింది. తన చాటింగ్‌లో నన్ను దారుణంగా చీటింగ్ చేశాడు. నా ఆశలను లక్షల ముక్కలు చేశావు అంటూ మెసేజ్ పంపింది అంటూ మీడియాకు ఆమె పంపిన ఛాటింగ్ మెసేజ్ చూపించారు.
ఆషికా రంగనాథ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. బలవన్మరణానికి ప్రేరేపించారనే ఆరోపణలపై మయాంక్ గౌడ, అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. తొలుత ఈ కేసును హసన్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసి.. ఆతర్వాత పుట్టెనహల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అచల కుటుంబ సభ్యులు మయాంక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆషికా రంగనాథ్ విషయానికి వస్తే.. కన్నడ, తెలుగు సినిమా రంగాల్లో నటిస్తున్నారు. గతంలో నాగార్జున అక్కినేని నటించిన నా సామిరంగ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి నటించే విశ్వంభర చిత్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమె నటించిన సర్దార్ 2 చిత్రం విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











