twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నడి రోడ్డుపై నటుడిని రక్తం కారేలా చితకబాదారు.. వైరల్ అవుతున్న వీడియో!

    |

    Recommended Video

    నడి రోడ్డుపై నటుడిని రక్తం కారేలా చితకబాదారు (వీడియో)

    కన్నడ నటుడు కోమల్ కుమార్ మీద నడిరోడ్డు మీద దాడి జరిగింది. బెంగుళూరులోని శ్రీరాంపురా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

    ఈ ఇన్సిడెంట్‌పై బెంగుళూరు పోలీస్ కమీషనర్ భాస్కర్ రావు ట్వీట్ చేశారు. 'మల్లేశ్వరం పోలీసులు ఈ కేసు విషయంలో వెంటనే స్పందించారు. అతడిపై యాక్షన్ తీసుకున్నారు. రౌడీ యాక్టివిటీస్‌కు ఇక్కడ చోటు లేదు. కేసు బుక్ చేసి అతడిని అరెస్ట్ చేశాం. ఈ విషయంలో పబ్లిక్ సపోర్ట్ చేసినందుకు థాంక్స్' అని పేర్కొన్నారు.

    దాడి చేసింది అతడే...

    దాడి చేసింది అతడే...

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. బైక్ రాష్‌గా డ్రైవ్ చేస్తూ అతడు కోమల్ కుమార్ కారును ఓవర్ టేక్ చేశాడు. అలా రాష్ డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అంటూ కోమల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో... తన బైకును కారుకు అడ్డంగా నిలిపి సదరు డెలివరీ బాయ్ ఘర్షణకు దిగారు.

    రక్తం కారేలా చితకబాదాడు

    రక్తం కారేలా చితకబాదాడు

    ఇద్దరి మధ్య మాట మాట పెరిగిపోవడంతో చివరకు.... బైకర్ కోమల్ కుమార్ ఫేస్ మీద పిడిగుద్దుల వర్షం కురపించాడు. దీంతో అతడి ముక్కు, నోరు నుంచి రక్తస్రావం మొదలైంది. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

    ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమల్

    ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమల్

    ప్రస్తుతం నటుడు కోమల్ కెఎస్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి మీద అటెమ్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కోమల్ కుమార్ తన కూతురును స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని కోమల్ కుమార్ తెలిపారు.

    అలా జరిగిందని తేలితే కోమల్ మీద కూడా చర్యలు

    అలా జరిగిందని తేలితే కోమల్ మీద కూడా చర్యలు

    అయితే కోమల్ మొదట గొడవ మొదలు పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీడియోలు కలెక్ట్ చేసిన తర్వాత అందులో కోమల్ మొదట గొడవకు దిగినట్లు తేలితే అతడిపై కూడా చర్యలు తీసుకుంటామని బెంగుళూరు నార్త్ జోన్ డిసిపి శశి కుమార్ తెలిపారు.

    కోమల్ కుమార్

    కన్నడ ప్రేక్షకులకు కోమల్ కుమార్ సుపరిచితమైన నటుడు. దాదాపు 90 వరకు శాండల్ వుడ్ చిత్రాల్లో నటించాడు. అంతే కాదు కన్నడ నటుడు, పొలిటీషియన్ జగ్గేష్‌కు సోదరుడు కూడా. కోమల్ కుమార్ మీద దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం కన్నడ చిత్ర సీమలో చర్చనీయాంశం అయింది.

    English summary
    The attack on Kannada actor Komal Kumar. In this case, Malleswaram police have arrested a culprit. The issue started when he allegedly overtook Komal's car in a rash manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X