twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి వల్లే ధైర్యం వచ్చింది.. ఆ అడ్డు గోడని బ్రేక్ చేసింది రాజమౌళే!

    |

    కన్నడ హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా మార్కెట్ పై కూడా కన్నేసాడు. కెజిఎఫ్ చిత్రం అన్ని భాషల్లో విడుదలవుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా యాష్ మీడియాలో మాట్లాడారు. ఇప్పటికే కెజిఎఫ్ చిత్రం భారీ హైప్ సొంతం చేసుకుంది. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. యష్ కనడ ప్రభాస్ అంటూ ఈ యువ హీరోకి ప్రశంసలు దక్కుతున్నాయి. ట్రైలర్ లాంచ్ లో యష్ బాహుబలి చిత్రంపై ప్రశంసలు కురిపించాడు.

    ఈ ధైర్యం బాహుబలి వల్లే

    ఈ ధైర్యం బాహుబలి వల్లే

    కెజిఎఫ్ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి బాహుబలి చిత్రమే కారణం అని తెలిపాడు. బాహుబలి చిత్రం అన్ని భాషల్లో విడుదలై అఖండ విజయం సాధించింది. బాహుబలి అందించిన ఆత్మవిశ్వాసంతోనే కెజిఎఫ్ చిత్రాన్ని కూడా అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు యష్ తెలిపాడు.

     అడ్డు గోడని బ్రేక్ చేసింది

    అడ్డు గోడని బ్రేక్ చేసింది

    నార్త్ సినిమాకు, సౌత్ సినిమాకు మధ్య ఏదో అడ్డుగోడ ఉందని అంతా భావించేవారు. కానీ రాజమౌళి తన ప్రతిభతో ఆ అడ్డుగోడని బాహుబలి చిత్రంతో బ్రేక్ చేశారని తెలిపాడు. తమ కెజిఎఫ్ చిత్రంలో అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయని తెలిపాడు. గతంలో చాలా సౌత్ చిత్రాలు నార్త్ లో రాణించాయి. కానీ పూర్తి స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేయలేకపోయారు.

     భారీ చిత్రం అని తెలుసు

    భారీ చిత్రం అని తెలుసు

    కెజిఎఫ్ చిత్రాన్ని భారీ చిత్రంగానే ప్రారంభించాం. కానీ ఇంత పెద్ద ఎత్తున జనాల్లోకి వెళుతుందని తాము ఊహించలేదని యష్ తెలిపాడు. అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన కూడా ముందుగాలేదు. కానీ ఈ చిత్ర అవుట్ ఫుట్ పై అవగాహనకు వచ్చాక కన్నడ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని భావించాం.

    అలాంటివి ఇష్టం లేదు

    అలాంటివి ఇష్టం లేదు

    గతంలో యష్ హైదరాబాద్ కు ఈ చిత్ర ప్రమోషన్ కోసం వచ్చిన సందర్భంగా మీడియా అతడిని రెండవ ప్రభాస్ అంటూ అభివర్ణించింది. కానీ యష్ అలాంటి పోలికకు ఇష్టపడలేదు. తాను మొదటి యష్ గానే ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 21న కెజిఎఫ్ విడుదలకు సిద్ధం అవుతోంది.

    English summary
    KGF actor Yash: Baahubali gave us the confidence to think about a bigger release. The trailers and posters of KGF have been quite impressive and have caught attention of the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X