ఆ స్టార్ హీరోకు బాలయ్య రిటర్న్ గిఫ్ట్, ఇండస్ట్రీలో హాట్ టాపిక్? అందుకేనా?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించిన ఓ వార్త మీడియాలో హాట్ టాపిక్ అయింది. కన్నడ టాప్ హీరోల్లో ఒకరైన శివరాజ్ కుమార్‌కు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆయన నటిస్తున్న 'భైరతి రనగల్' అనే చిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ఫ్యామిలీకి బాలయ్య చాలా క్లోజ్. ఇటీవల బెంగుళూరులో 'ఎన్టీఆర్-కథానాయకుడు' సినిమా ప్రమోషన్స్ జరిగినపుడు కూడా శివరాజ్ కుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ వెంటే ఉండి ఏర్పాట్లు చూసుకున్నారు. ఆ సమయంలో బాలయ్య బుగ్గకు ఏదో మరక అంటితే స్వయంగా తన చేతిరుమాలుతో తుడవటం తెలిసిందే.

కెరీర్లో 125వ సినిమా

కెరీర్లో 125వ సినిమా

కన్నడ సినీ పరిశ్రమలో సెంచరీ పూర్తి చేసిన హీరోల్లో శివ రాజ్ కుమార్ ఒకరు. ‘భైరతి రనగల్' శివ రాజ్ కుమార్ నటిస్తున్న 125వ చిత్రం. ఇది ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో బాలయ్యతో అతిథి పాత్ర చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాలయ్య మూవీలో శివ రాజ్ కుమార్, అందుకే రిటర్న్ గిఫ్ట్

గతంలో బాలయ్య మూవీలో శివ రాజ్ కుమార్, అందుకే రిటర్న్ గిఫ్ట్

బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ క్రిష్ రూపొందించారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఆయన చిత్రంలో నటించడానికి ఓకే చెప్పి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.

‘భైరతి రనగల్'

‘భైరతి రనగల్'

‘భైరతి రనగల్' చిత్రానికి నార్తన్ దర్శకత్వం వహించబోతున్నారు. శ్రీ ముత్తు సినీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించబోతున్నారు. శివ రాజ్ కుమార్ కెరీర్లో 125వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు.

బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్

బాలయ్య ‘ఎన్టీఆర్ బయోపిక్

కాగా... బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వసూళ్లు కూడా బావున్నాయి. రెండో భాగం ‘ఎన్టీఆర్-మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X