Don't Miss!
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Rashmika Mandanna పై కన్నడ పరిశ్రమ నిషేధం.. కిచ్చ సుదీప్ రియాక్షన్ ఏమిటంటే?
కన్నడ పరిశ్రమ అందించిన ప్రోత్సాహాంతో స్టార్‌గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం తన మూలాలను మరిచి పోయిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆమెపై అనధికారికంగా నిషేధం విధించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి, రష్మిక మధ్య నెలకొన్న వివాదం తర్వాత పూర్తిగా ఆమెపై కన్నడ ప్రేక్షకులు నిప్పులు చెరుగుతున్నారు. దాంతో ఆమెపై నిషేధం విధించిందనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
అయితే తనపై వస్తున్న నిరాధార ఆరోపణలపై రష్మిక ఇటీవల స్పందించింది. తనపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలన్నీ అవాస్తవాలు అని రష్మిక వార్తలను కొట్టిపడేసింది.

అయితే రష్మిక మందన్నపై కన్నడ సినీ పరిశ్రమ నిషేధం విధించిందనే వార్తలపై కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ తనదైన శైలిలో స్పందించారు. మీడియా విస్తృతి బాగా పెరిగింది. స్వర్గీయ రాజ్‌కుమార్ సమయంలో దూరదర్శన్, ఒకట్రెండు పేపర్లు ఉండేవి. మా సమయంలో చాలా టెలివిజన్ ఛానెల్స్, సోషల్ మీడియా వచ్చేసింది. వార్తలు ఎక్కడ పుడుతున్నాయనే విషయం ఎవరికీ తెలియడం. సోషల్ మీడియా కారణంగా కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. వాటిని మనం నియంత్రించాల్సిన అవసరం ఉంది. సినిమా పరిశ్రమలో ఉండే సెలబ్రిటీలకు దండలు వేస్తారు. అవసరమైతే గుడ్లు, టామోటాలు, రాళ్లు విసురుతారు. మనమే జాగ్రత్తగా ఉండాలి అని కిచ్చ సుదీప్ పరోక్షంగా రష్మికపై కామెంట్ చేశారు.
మనపై వచ్చే విమర్శలు, ఆరోపణలను ధీటుగా ఎదుర్కొనే సాధన చేయాలి. మనకు వ్యతిరేకంగా ఏదైనా విషయం బయటకు వస్తుందంటే.. నాలుకను జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. మన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా అకౌంట్లలో బాధ్యతగా ఉండాలి. లేకపోతే నెగిటివ్ కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వస్తాయి అని కిచ్చ సుదీప్ అన్నారు.