బిగ్‌బాస్ కంటెస్టెంట్ సూసైడ్ యత్నం.. కాపాడిన హోస్ట్ కిచ్చ సుదీప్.. ఏం జరిగిందంటే!
కన్నడ బిగ్‌బాస్ సెలబ్రిటీ జయశ్రీ రామయ్య కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్ చాటింగ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించడం దక్షిణాదిలో సంచలనం రేపింది. అలా మానసిక క్షోభతో సూసైడ్‌కు ప్రయత్నించిన జయశ్రీని నటుడు, బిగ్ బాస్ హోస్ట్ కిచ్చ సుదీప్ ఆదుకోవడం జరిగింది. ఆ సంఘటన గురించి జయశ్రీ స్పందిస్తూ..
Recommended Video

పబ్లిసిటీ కోసం అలా చేయడం లేదు
మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లడానికి నిర్ణయం తీసుకొన్నాను. ఇది పబ్లిసిటీ కోసం ఇలా చేయడం లేదు. సుదీప్ సార్ నుంచి నాకు ఎలాంటి సహాయం ఆశించడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొంటున్నాను అంటూ ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో జయశ్రీ షాకింగ్ కామెంట్లు చేశారు.

నా ముందున్నది మరణం మాత్రమే
నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. దానిని జయించాలంటే మరణం ఒక్కటే నా ముందు ఉన్న మార్గం. నాకు ఆర్థికపరమైన సమస్యలు లేవు. కానీ డిప్రెషన్‌తో బాధపడుతున్నాను. చాలా వ్యక్తిగత సమస్యలు నన్ను అతలాకుతలం చేస్తున్నాయి. బాల్యం నుంచే నేను వివక్షకు గురవుతున్నాను. వాటిని ఎన్నడూ అధిగమించలేకపోతున్నాను అని జయశ్రీ వీడియోలో చెప్పింది.

నేను పరాజితురాలిని అంటూ
జీవితంలో ఏది సాధించలేననే ఓ భయం నన్ను వెంటాడుతున్నది. నేను ఓ పరాజితురాలిని. అందుకే నేను స్వయంగా నాకు నేను మరణం పొందాలని నిర్ణయించుకొన్నాను. నేను చివరిగా ఇది చెప్పాలనుకొన్నాను. నేను మంచి యువతిని కాను. దయచేసిన నాకు మెర్సీ కిల్లింగ్‌కు సహకరించండి అంటూ జయశ్రీ రామయ్య లైవ్‌లో తన బాధను వ్యక్తం చేశారు.

సుదీప్ చొరవతో విరమించుకొన్న జయశ్రీ
ఆ తర్వాత కిచ్చ సుదీప్ తీసుకొన్న చొరవతో జయశ్రీ రామయ్య తన ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకొన్నారు. సుదీప్ ఇచ్చిన మానసిక ధైర్యం ఆమెకు మంత్రంలా పనిచేసింది. ఆ తర్వాత ఆమె మాములు మనిషిగా మారింది. మళ్లీ జయశ్రీ జీవితం గాడిలో పడింది. దీంతో తన తప్పును తెలుసుకొని సుదీప్‌కు థ్యాంక్స్ చెబుతూ ఓ లేఖను రాసింది.

సుదీప్ సార్.. మీ రుణం ఎలా తీసుకోవాలో..
కిచ్చ సుదీప్ సార్.. మీరు చేసిన సహాయానికి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మీ చొరవ వల్ల నా జీవితం కాపాడబడింది. అందుకు కారణం మీరు, మీ సహాయ బృందం మాత్రమే. మిమల్ని కొంతసేపు భయాందోళనలకు గురిచేశాను. అందుకు క్షమించండి. మళ్లీ నా జీవితం గాడిలోపడింది. నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి, మీడియాకు థ్యాంక్స్ అంటూ జయశ్రీ రామయ్య ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











