twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #BoycottRRRinKarnataka రాజమౌళిపై కన్నడిగుల కన్నెర్ర.. KGF2ను చూసుకొంటాం.. తెలుగు నెటిజన్ల వార్నింగ్

    |

    భారతీయ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ విడుదలకు అంతా సిద్దమైంది. పలుమార్లు విడుదల వాయిదా పడి చిట్టచివరకు మార్చి 25వ తేదీన రిలీజ్‌కు రెడీ అయింది. అయితే కర్ణాటకలో ఈ సినిమాపై స్థానికులు భగ్గుమంటున్నారు. శివరాజ్ కుమార్‌ను, కన్నడ ప్రజలను అవమానించారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే RRR రిలీజ్‌కు ముందు దర్శకుడు రాజమౌళి, RRRపై కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటంటే..

    Recommended Video

    Kannadigas Angry With RRR Movie..తప్పెవరిది ? | RRR Vs KGF 2 | Filmibeat Telugu
    రాజమౌళికి శివరాజ్ కుమార్ రిక్వెస్ట్

    రాజమౌళికి శివరాజ్ కుమార్ రిక్వెస్ట్

    RRR సినిమా ప్రమోషన్‌లో భాగంగా కర్ణాటకలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్, డీవీవీ దానయ్య భారీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో కర్ణాటక సీఎం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. రాజమౌళికి కన్నడవాసులందరి తరపున ఒకే రిక్వెస్ట్. RRR సినిమాను కన్నడ భాషలో రిలీజ్ చేస్తే సంతోషంగా ఉంటుంది అని శివరాజ్ కుమార్ వేడుకొన్నారు.

    కన్నడ భాషలో రిలీజ్ చేస్తే తప్ప..

    కన్నడ భాషలో రిలీజ్ చేస్తే తప్ప..

    అయితే మార్చి 25న రిలీజ్ అవుతున్న RRR సినిమాను కన్నడ భాషలో కాకుండా కర్ణాటక వ్యాప్తంగా తెలుగులో రిలీజ్ చేయడంపై కన్నడ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శివరాజ్ కుమార్ రిక్వెస్ట్‌ను పట్టిచుకోకుండా కన్నడ డబ్బింగ్ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదు. మాకు కన్నడ భాషలో రిలీజ్ చేస్తే తప్ప ఈ సినిమాను చూడలేం. కాబట్టి RRR సినిమాను బాయ్‌కాట్ చేయండి అంటూ #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు.

     కన్నడ భాషలో

    కన్నడ భాషలో

    RRR సినిమాను కన్నడ భాషలో రిలీజ్ చేయకుండా రాజమౌళి చీటింగ్ చేస్తున్నాడు. చిక్ బల్లాపూర్‌లో శివరాజ్ కుమార్ రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా RRR సినిమాను కన్నడ భాషలో రిలీజ్ చేయడం లేదు. అందుకే ఆ సినిమాను బాయ్‌కాట్ చేయండి అంటూ #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌తో ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

    RRR ను బ్యాన్ చేస్తాం

    RRR ను బ్యాన్ చేస్తాం

    కన్నడ భాషలో RRR సినిమాను రిలీజ్ చేయకుండా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దారుణంగా కన్నడ ప్రజలను అవమానిస్తున్నాడు. కన్నడ భాషలో రిలీజ్ చేస్తే స్వాగతిస్తాం. లేదంటే ఈ సారి RRR సినిమాను బ్యాన్ చేస్తాం అని మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

    డిస్టిబ్యూటర్‌దే తప్పు అంటూ

    డిస్టిబ్యూటర్‌దే తప్పు అంటూ

    కన్నడ భాషలో RRR మూవీని రిలీజ్ చేయకపోవడానికి కారణం రాజమౌళి కాదు. కన్నడలో రిలీజ్ చేసే డిస్టిబ్యూటర్‌దే తప్పు. యూకేలో డిస్టిబ్యూటర్ కన్నడ భాషలో రిలీజ్ చేస్తున్నాడు. కర్ణాటక విషయానికి వస్తే కన్నడ డిస్టిబ్యూటర్‌దే తప్పు. కర్ణాటకలో కన్నడ డబ్బింగ్ RRRను ఎందుకు రిలీజ్ చేయడం లేదో అర్ధం కావడం లేదు. ఒకవేళ RRR కన్నడ భాషలో రిలీజ్ చేస్తే రూరల్ ప్రాంతంలో మంచి కలెక్షన్లు వస్తాయి అని నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

    మొన్న బాహుబలి.. నేను RRR

    మొన్న బాహుబలి.. నేను RRR


    అయితే తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లు కూడా #BoycottRRRinKarnataka పై ఘాటుగా స్పందిస్తున్నారు. అప్పట్లో బాహుబలి సినిమాను బాయ్‌కాట్ చేశారు. మొన్న పుష్ప, ఇప్పుడు RRR వంతయ్యింది. కన్నడ ప్రేక్షకులకు ఇది అలవాటుగా మారిపోయింది. ప్రతీ సారి ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్‌తో ట్రెండింగ్ చేస్తారు. ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్నది. అప్పుడు మా తడాఖా చూపిస్తాం అని తెలుగు నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు.

    కేజీఎఫ్ 2 మూవీకి సపోర్ట్ చేస్తున్నాం..

    కేజీఎఫ్ 2 మూవీకి సపోర్ట్ చేస్తున్నాం..

    తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 సినిమాను సపోర్ట్ చేస్తున్నాం. సరైన కారణం లేకుండా RRR మూవీని బాహుబలి2 మాదిరిగానే బ్యాన్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. కొందరు కన్నడవాసులను చూస్తే అసహ్యం వేస్తున్నది. మేము అందర్ని రెస్పెక్ట్ చేస్తాం. ఆ విషయాన్ని గుర్తుంచుకొండి అంటూ #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌పై ఘాటుగా స్పందించారు.

    కన్నడ భాషలో రిలీజ్ ఎందుకు చేయడం లేదంటూ..

    కన్నడ భాషలో రిలీజ్ ఎందుకు చేయడం లేదంటూ..

    అయితే RRR వివాదం నేపథ్యంలో కేజీఎఫ్2 రిలీజ్‌ సమయంలో మేము చూసుకొంటాం అని తెలుగు నెటిజన్ చేసిన ట్వీట్‌కు కన్నడ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. కేజీఎఫ్2 సినిమాను తెలుగు భాషలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కన్నడ వెర్షన్ రిలీజ్ చేస్తే ఊరుకొంటారా? తమిళనాడు తమిళ వెర్షన్, కేరళలో మలయాళ వెర్షన్, ఉత్తరాదిలో హిందీ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. కర్ణాటకలో కన్నడ భాషలో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

    English summary
    Boycott RRR in Karnataka has tag is trending on Twitter. Netizen tweeted that To all those abusing ss rajamouli... Look how the UK distributor has alloted shows... Its entirely the fault of karnataka distributor.. I dont understand why a businessman wouldn't release in kannada for more reach in rural karnatak
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X