twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దండుపాళ్యం4కి బిగ్ షాక్.. అసభ్యంగా, హింసాత్మకంగా.. ప్రజలు ఈ సినిమా చూస్తే!

    |

    Recommended Video

    Dandupalya 4 Movie Has Stopped Its Sensor | Filmibeat Telugu

    కర్ణాటకలోని దండుపాళ్యం అనే ప్రాంతంలో జరిగే దోపిడీలు, హత్యలు, హింసాత్మక సంఘటనల ఆధారంగా దండుపాళ్యం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 3 చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణతో దండుపాళ్యం సిరీస్ కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ వస్తోంది. దీనితో దండుపాళ్యం 4 కూడా రెడీ అవుతోంది. తాజా దండుపాళ్యం 4 చిత్రానికి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ అంశానికి సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

    సెన్సార్ షాక్

    సెన్సార్ షాక్

    వీలైనంత త్వరగా చిత్రాన్నివిడుదల చేయాలని భావిస్తున్న నిర్మాతలు దండుపాళ్యం 4 చిత్రానికి సెన్సార్ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. సినిమాని చూడగానే షాక్ కి గురైన సెన్సార్ సభ్యులు ఇలాంటి చిత్రాలకు సర్టిఫికెట్ జారీ చేయడం కుదరని పని అని తేల్చి చెప్పేశారట. దండుపాళ్యం మొదట మూడు భాగాలని మించేలా ఈ చిత్రంలో మితిమీరిన హింస, వల్గర్ సన్నివేశాలు ఉన్నట్లు సెన్సార్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

    అత్యంత దారుణంగా

    అత్యంత దారుణంగా

    దండుపాళ్యం నేరాలని మొదటి భాగంలో కళ్ళకు కట్టినట్లు దర్శకుడు శ్రీనివాస్ రాజు చూపించారు. కానీ ఆ తర్వాత అసభ్యకర రీతిలో శృంగారం, హత్యలకు సంబందించిన సన్నివేశాలు దారుణంగా ఉండడంతో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం అలాంటి సన్నివేశాలే ఉండడంతో కట్స్ కానీ, రీషూట్ కానీ ప్రతిపాదించకుండా సినిమాని విడుదలకు అంగీకరించడం కుదరదని తేల్చేశారు.

    నిర్మాత వాదన మరోలా

    నిర్మాత వాదన మరోలా

    ఈ చిత్ర నిర్మాత వెంకటేష్ సెన్సార్ సభ్యుల వైఖరి కారణంగా కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయన కర్ణాటక నిర్మాతల మండలి ఆశ్రయించారు. గత ఏడాది నవంబర్ 7నే ఈ చిత్రాన్ని సెన్సార్ వద్దకు తీసుకుని వెళ్లాం. కానీ సెన్సార్ సభ్యులు ఆసల్యం చేస్తూ ఆ తర్వాత వచ్చిన చిత్రాలకు కూడా సర్టిఫికెట్ జారీ చేశారు. మా చిత్రాన్ని చూడడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. ఇటీవల ఒత్తిడి తీసుకురావడంతో సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్ర విడుదలకు అనుమతి ఇవ్వడం లేదని నిర్మాత వాపోయారు. తాను కోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.

    <strong>వివాదంలో దండుపాళ్యం4.. దర్శకుడు శ్రీనివాసరాజు అవుట్.. నిర్మాతపై పూజాగాంధీ, మకరంద్ ఫైర్..</strong>వివాదంలో దండుపాళ్యం4.. దర్శకుడు శ్రీనివాసరాజు అవుట్.. నిర్మాతపై పూజాగాంధీ, మకరంద్ ఫైర్..

     అవి తప్ప ఇంకేం లేవు

    అవి తప్ప ఇంకేం లేవు

    దండుపాళ్యం 4 చిత్రంలో నరకటం, చంపటం, అసభ్య కరంగా ఉండే వస్త్రధారణ, శృంగార సన్నివేవాలు మినహా మరేమి లేదని సెన్సార్ సభ్యుల నుంచి టాక్ వస్తోంది. మహిళని మహిళ లైంగికంగా దాడిచేసే సన్నివేశాలు నీచంగా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.దండుపాళ్యం 4ని విడుదలకు అనుమతి ఇస్తే ప్రజలు సహించరు అని ఓ సెన్సార్ సభ్యుడు మీడియాతో పేర్కొన్నారు. అందువలనే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించినట్లు శాండల్ వుడ్ లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

    English summary
    Censor gives big shock to Dandupalyam 4. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X