చివరి కోరిక తీరకుండానే చిరంజీవి సర్జా.. మరణం వెనుక కారణం.. భార్యకు మహా విషాదం

కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం దక్షిణాది సినీలోకాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణ వార్త వినగానే సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణంతో కన్నీటి సాగరంలో మునిగిపోయారు. అయితే చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పరిస్థితి ఇంకా మాటల్లో చెప్పలేని పరిస్థితి. యుక్త వయసులో భర్తకు దూరం కావడం ఎవరికైనా విషాదమే. అయితే ఈ కన్నీటి పరిస్థితుల్లో ఆమెను మరో మహా విషాదం వెంటాడుతున్నది. అదేమిటంటే..

ఫోన్‌లో మాట్లాడుతుండగానే

ఫోన్‌లో మాట్లాడుతుండగానే

చిరంజీవి సర్జా మరణంపై కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోగ్యపరంగా చిరంజీవికి ఎలాంటి సమస్యలు లేవు. జూన్ 7వ తేదీన తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి మొదలైంది. కాసేపట్లోనే ఆ నొప్పి మరింత పెరిగిపోవడంతో అపోలోకు తరలించాం. కానీ చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు. దాంతో తుదిశ్వాస విడిచారు అని కన్నీరుమున్నీరయ్యారు.

మేఘనా రాజ్‌తో వివాహం

మేఘనా రాజ్‌తో వివాహం

చిరంజీవి సర్జా వ్యక్తిగత జీవితానికి వస్తే.. హీరోయిన్ మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. మేఘనా రాజ్ మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. మేఘనా రాజ్ సినీ జీవితం తెలుగుతోనే ఆరంభమైంది. అల్లరి నరేష్‌తో కలిసి బెండు అప్పారావు ఆర్ఎంపీ అనే చిత్రంలో నటించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత లక్కీ అనే చిత్రంలో నటించారు. అనంతరం ఆమె మలయాళ సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు. ఆమెను చిరంజీవి సర్జా 2018లో వివాహం చేసుకొన్నారు.

మేఘనా రాజ్ గర్బవతిగా

మేఘనా రాజ్ గర్బవతిగా

ఇటీవలే చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ దాంపత్య జీవితంలో శుభవార్త తెలిసింది. మేఘనా రాజ్‌ ఇటీవలే గర్బవతి కావడంతో తనకు వారసుడో లేదా వారసురాలో వస్తారనే ఆనందంలో చిరంజీవి సర్జా మునిగిపోయారట. ఈ ప్రపంచానికి తన సంతానాన్ని పరిచయం చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే చిరంజీవి సర్జాను మృత్యువు కబళించింది. దాంతో మేఘనా రాజ్‌కు తీరని శోకాన్ని మిగిల్చింది.

మేఘన పరిస్థితి చూస్తే..

మేఘన పరిస్థితి చూస్తే..

మేఘనా రాజ్ పరిస్థితిపై బంధువులు స్పందిస్తూ.. ఆమె పుట్టెడు దు:ఖంలో మునిగిపోయింది. ఆమె పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతున్నది. మేఘనా రాజ్, చిరంజీవి సర్జా తమకు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఇంతలోనే దేవుడు ఆయనను తీసుకెళ్లి మేఘనాకు తీరని శోకాన్ని మిగిల్చాడు అని బాధలో మునిగిపోయారు. సోమవారం రోజున చిరంజీవి సర్జా అంత్యక్రియలు ముగిసాయి.

 యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిగా

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిగా

ఇక చిరంజీవి సర్జా విషయానికి వస్తే.. ప్రముఖ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. అర్జున్‌ను స్పూర్తిగా తీసుకొని ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. కేవలం 39 ఏళ్లలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ప్రతీ ఒక్కరిని విషాదానికి గురిచేసింది. ఆయన మరణానికి జీర్ణించుకోలేకపోతున్నామని సినీ ప్రముఖులు, స్నేహితులు పలువురు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X