»   » వివాదంలో దండుపాళ్యం4.. దర్శకుడు శ్రీనివాసరాజు అవుట్.. నిర్మాతపై పూజాగాంధీ, మకరంద్ ఫైర్..

వివాదంలో దండుపాళ్యం4.. దర్శకుడు శ్రీనివాసరాజు అవుట్.. నిర్మాతపై పూజాగాంధీ, మకరంద్ ఫైర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దండుపాళ్యం చిత్రం క్రైమ్, థ్రిల్లర్ చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచింది. దండుపాళ్యం విజయం దండుపాళ్యం2, దండుపాళ్యం3, దండుపాళ్యం4 లాంటి చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. దండుపాళ్యం సక్సెస్‌తో దర్శకుడు శ్రీనివాసరాజు దండుపాళ్యం2, దండుపాళ్యం3 చిత్రాలను రూపొందించారు. అయితే దండుపాళ్యం4 విషయానికి వస్తే కొంత గందరగోళం కనిపిస్తున్నది. దండుపాళ్యం4 ప్రకటిస్తూ సమావేశాన్ని నిర్వహించారు నిర్మాత వెంకట్. అయితే తాము దండుపాళ్యం4 చిత్రంలో నటించడం లేదని దండుపాళ్యం సిరీస్‌లో నటించిన పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవిశంకర్ వీడియో ప్రకటన చేశారు. ఇంతకు వారు ఏమన్నారంటే..

నిర్మాత వెంకట్ చెప్పిదేమంటే..

నిర్మాత వెంకట్ చెప్పిదేమంటే..

వెంక‌ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై కేటి నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ నిర్మిస్తున్న చిత్రం `దండుపాళ్యం 4`. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంక‌ట్ మాట్లాడుతూ - ``దండుపాళ్యం పార్ట్ 1, పార్ట్‌2ల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం అని తెలిపారు.

దండుపాళ్యం3 డైరెక్టర్ ఎవరో

దండుపాళ్యం3 డైరెక్టర్ ఎవరో

ఇప్పుడు దండుపాళ్యం3కి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తెలియ‌దు. ఆర్టిస్టుల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం, నా కృషితో రెండు సినిమాలు ప్ర‌జ‌ల‌కు బాగా రీచ్ అయ్యాయి. ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మంచి ఇంటెలిజెంట్‌.. హార్డ్‌వ‌ర్క‌ర్‌. ఈయ‌న‌కు క్రైమ్ జోన‌ర్‌లో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఆయ‌న ఎలా దండుపాళ్యం 4 చేయ‌వ‌చ్చో చెప్పిన తీరు నాకు న‌చ్చింది అని అన్నారు.

 ఇగో కారణంగా సరిగా ఆడలేదు..

ఇగో కారణంగా సరిగా ఆడలేదు..

కొంద‌రి వ్య‌క్తిగ‌త ఇగో కార‌ణంగా దండుపాళ్యం2 నేను అనుకున్న‌ట్లుగా రాలేదు. ఆడియెన్స్‌ను ఏమైతే సినిమాలో ఉండాలనుకుని థియేట‌ర్‌కి వ‌చ్చారో అది సినిమాలో లేదు. దాంతో ఓ క‌సితో దండుపాళ్యం 4ను స్టార్ట్ చేశాను. ప‌క్కా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో సినిమాను స్టార్ట్ చేస్తున్నాం. మార్చి 8న సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

 దండుపాళ్యంలో రెండు గ్యాంగులు

దండుపాళ్యంలో రెండు గ్యాంగులు

దండుపాళ్యం4 లో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొద‌టి మూడు పార్ట్స్‌లో న‌టించిన నటీన‌టుల‌తో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో క‌న‌ప‌డుతుంది. దండుపాళ్యం రీసెర్చ్‌లో మాకు దొరికిన స‌మాచారంతో ప‌ది సీక్వెల్స్ తీయ‌వ‌చ్చు. నిజ‌మైన ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఆస‌క్తిక‌రమైన స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది అని వెంకట్ అన్నారు.

కేటీ నాయక్ మాట్లాడుతూ..

కేటీ నాయక్ మాట్లాడుతూ..

ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మాట్లాడుతూ ``నేను నిజామాబాద్ ఆర్మూర్‌లో పుట్టి పెరిగాను. కానీ త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో స్థిర‌ప‌డ్డాను. నాకు ఇచ్చిన ప‌నిని 100 శాతం నేర‌వేరుస్తాను. ప్రొడ్యూస‌ర్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ధీటుగా ఈ సీక్వెల్ ఉంటుంది`` అన్నారు. అయితే ఇది జరిగిన వెంటనే గతంలో దండుపాళ్యంలో నటించిన నటులంతా నిర్మాత వైఖరిని తప్పుపట్టారు.

నటించడం లేదు.. పూజాగాంధీ

నటించడం లేదు.. పూజాగాంధీ

దండుపాళ్యం4 చిత్రంలో నేను నటించడం లేదు అని హీరోయిన్ పూజాగాంధీ వీడియో ప్రకటన ద్వారా తెలిపారు. నేను దండుపాళ్యం4లో నటిస్తున్నట్టు ప్రకటించడం ఓ పెద్ద జోక్. ఈ చిత్రం గురించి నన్ను ఎవరూ అప్రోచ్ కాలేదు. నా అనుమతి, ప్రమేయం లేకుండా నా ఫోటోలను, నా పేరును దండుపాళ్యం4 కోసం వాడుకొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నా ఫోటోలను, పేరు వాడకూడదు అని పూజాగాంధీ మీడియాను కోరింది.

నిర్మాతపై రవిశంకర్ ఫైర్

నిర్మాతపై రవిశంకర్ ఫైర్

నిర్మాత వెంకట్ నిర్మాణంలో దండుపాళ్యం4 సినిమా వస్తుందని విన్నాను. కానీ ఆ చిత్రంలో నటించడం లేదు అని రవిశంకర్ వీడియో ప్రకటనలో తెలిపారు. ఆ చిత్రంలో నా ఫోటోను వాడుకొన్నారు. కానీ నిర్మాత వెంకట్ నా ఫోటోను వాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆ చిత్రంలో నేను గానీ, మిగితా ఆర్టిస్టులుగానీ నటించడం లేదు.

మా ఫోటోలు వాడొద్దు

మా ఫోటోలు వాడొద్దు

పార్ట్2లో నిర్మాత వెంకట్ మార్గదర్శకత్వంలో నటించాం. దండుపాళ్యం4లో మేము నటించడం లేదు. కావున మీరు ఆ చిత్రంలో నటించే వారి ఫోటోలనే వాడుకోవాల్సి ఉండేది. అలా కాకుండా మా ఫోటోలను వాడుకోవడం సరికాదు అని నిర్మాత వెంకట్‌కు రవిశంకర్ సూచించారు.

 నిర్మాత అలా చేయకుండా..

నిర్మాత అలా చేయకుండా..

దండుపాళ్యం4 వివాదం నేపథ్యంలో నటుడు మకరంద్ దేశ్‌పాండే వీడియోను రిలీజ్ చేశారు. నేను దండుపాళ్యం1, 2, 3 చిత్రాల్లో నటించాను. దండుపాళ్యం4 చిత్రంలో నటించడం లేదు. ఆ సినిమా పోస్టర్‌లో నా ఫోటోను, పేరును వాడుకొన్నారు. నిర్మాత వెంకట్ గారు అలా చేసి ఉండాల్సింది కాదు అని మకరంద్ దేశ్‌పాండే అన్నారు.

 వివాదం అక్కడే మొదలు..

వివాదం అక్కడే మొదలు..

దర్శకుడు శ్రీనివాసరాజును తప్పించడంతోనే దండుపాళ్యం4 వివాదం మొదలైంది. దండుపాళ్యం సిరీస్‌ను ప్రజాదరణ పొందేలా చేయడంలో శ్రీనివాస్‌రాజు సఫలమయ్యారు. దండుపాళ్యం సిరీస్‌ను ఓ బ్రాండ్‌గా మలచడండంలో శ్రీనివాస్‌రాజు సక్సెస్ సాధించారు.

శ్రీనివాసరాజును పక్కన పెట్టి

శ్రీనివాసరాజును పక్కన పెట్టి

దండుపాళ్యం సీరిస్‌ను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంతోపాటు రెవెన్యూపరంగా మంచి ఫలితాలను శ్రీనివాసరాజు సాధించారు. దండుపాళ్యం అంటేనే ఓ క్రేజ్‌ను క్రియేట్ చేసిన శ్రీనివాసరాజును పక్కన పెట్టి నిర్మా వెంకట్ కొత్త దర్శకుడితో దండుపాళ్యం4ను ప్రారంభించడం ప్రేక్షకులకు ఓ షాక్‌కు గురిచేసింది.

వివాదంలో దండుపాళ్యం4

వివాదంలో దండుపాళ్యం4

ఇలాంటి విభిన్న ప్రకటనల మధ్య దండుపాళ్యం4 చిత్రం ప్రారంభమైంది. ఓపెనింగ్‌కు ముందే వివాదంలో కూరుకుపోయింది. దర్శకుడు శ్రీనివాసరాజు, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు లేకుండా ఈ సినిమా రూపొందిందితే గతంలో పొందిన ప్రజాదరణ, సక్సెస్ పొందుతుందా అనేది ప్రశ్నగా మారింది.

English summary
Dandupalya4 movie going to start on March 8th. In this occassion some actors given contraversial statement. Pooja Gandhi said that I am not doing Dandupalya4. First of all it’s a joke and on top of that no one ever approached me or any of my associates regarding the same .No one approached me with this project and WITHOUT MY CONSENT how can anyone put my name or use my picture .I request u and all the media that cover the information that is right n true .I am not a part of Dandupalya 4 so kindly keep my name n pictures out of any kind of news about this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu