twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhanush Review on Kantara కాంతార మైండ్ బ్లోయింగ్.. తప్పక చూడాల్సిన సినిమా అంటూ!

    |

    సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు కాంతారా అనే సినిమా గురించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అబ్బురపరిచే గ్రాఫిక్స్ సన్నివేశాలు పెద్దగా ఏమీ లేవు. అలాగే భారీ యాక్షన్స్ సిన్నిబేషలు కూడా అంతగా లేవు. కానీ కన్నడ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక త్రిల్లింగ్ డ్రామా ఉండడం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే దిశగా ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టించబోతోంది.

    సెప్టెంబర్ 30వ తేదీన పెద్దగా అంచనాలు ఏమీ లేకుండా విడుదలైన కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చింది. ఇక రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ సినిమాను చూసిన చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారి సపోర్ట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు.

    Danush review on kannada hit movie kantara special tweet viral

    ఇక తమిళ హీరో ధనుష్ కూడా కాంతారా సినిమా మైండ్ బ్లోయింగ్ అంటూ తప్పకుండా చూడవలసిన సినిమా ఇది అని కథానాయకుడు దర్శకుడు రిషబ్ శెట్టి తనను తాను చూసుకుంటూ గర్వపడాలి అని అలాగే హోంబెల్ ఫిలిమ్స్ కు కూడా ధనుష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బౌండరీస్ ను దాటి ఇంకా ఈ సినిమా బాగా ఆడాలి అని కాంతార సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ కు అలాగే నటినటులకు అందరికీ కూడా ధనుష్ తన బెస్ట్ విషెస్ అందజేశారు.

    కన్నడ యాక్షన్ త్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఇక రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించడమే కాకుండా ఈ సినిమాకు తనే రచయిత దర్శకుడిగా కూడా వర్క్ చేశాడు. ఇక కిషోర్, అచ్యుత్ కుమార్ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ చిత్రాల్లో ఇప్పుడు కాంతార కూడా నిలవబోతోంది. ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం.

    English summary
    Danush review on kannada hit movie kantara special tweet viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X