రాబర్ట్: విడుదలకు ముందే సెన్సేషనల్ రికార్డ్.. ఓ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్

కొన్ని సినిమాలు షూటింగ్ సమయంలోనే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసుకొని భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంటాయి. తాజాగా అదే బాటలో వెళుతోంది ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కన్నడ మూవీ రాబర్ట్. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.

ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ న్యూలూక్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఓ డిఫెరెంట్ అవతారంలో ఆయన కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపయింది. ఈ చిత్రంలో దర్శన్ మూడు షేడ్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు రాబర్ట్ కాగా, మిగతా రెండు అవతారాల విషయమై రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తోంది చిత్రయూనిట్.

Darshans Roberrt Creates New Record before release

ఈ నేపథ్యంలో రాబర్ట్ మూవీ పంపిణీ హక్కులపై పలు సంస్థలు ఆసక్తి చుపుతున్నాయి. ఈ మేరకు కోట్ల రూపాయలలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. మొత్తంగా రాబర్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 67 కోట్లు నమోదయింది. ఇందులో థియేట్రికల్ రైట్స్ రూపంలో 35 కోట్లు రాగా, డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 32 కోట్ల బిజినెస్ జరిగింది. ఆడియో రైట్స్ 5 కోట్లకు అమ్ముడయ్యాయి.

దీంతో కన్నడ చిత్రసీమలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 50 కోట్లకు పైగా రాబట్టిన తొలి చిత్రంగా రాబర్ట్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో దర్శన్ సరసన ఆశా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X