ప్రముఖ హీరో భార్యకు కరోనా వైరస్.. క్లారిటీ ఇచ్చిన సతీమణి
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీప భార్య విజయలక్ష్మికి కరోనావైరస్ పాజిటివ్ అనే వార్త దక్షిణాది మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో క్లారిటీ కోసం దర్శన్ దంపతులకు లెక్కలేనన్ని కాల్స్ వెళ్లి వెళ్లాయి. ఆ రూమర్ వెనుక అసలు కారణమేమిటంటే..
దర్శన్ కుటుంబం బెంగళూరులోని హోసకెరెహళ్లిలోని స్వాంకీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని వారికి కరోనావైరస్ సోకిందనే వార్త బయటకు రావడంతో అది దర్శన్ భార్యకే అనే రూమర్ మీడియాలో వచ్చింది. అయితే మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లపై దర్శన్ దంపతులు మీడియాలో స్పందించారు. తమ ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

దర్శన్ భార్య విజయలక్ష్మీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నాకు కరోనావైరస్ సోకిందనే వార్తలు నావద్దకు వచ్చాయి. అయితే నాకు కరోనా పాజిటివ్ అనే వార్త తప్పు. ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రతీ ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అని విజయలక్ష్మీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, స్వాంకీ అపార్ట్‌మెంట్‌లో రవిశంకర్ గౌడ, పూజా గాంధీ లాంటి సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం.
దర్శన్, విజయలక్ష్మి వ్యక్తిగత విషయానికి వస్తే.. వారిద్దరికి 2011లో వివాహం జరిగింది. తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భర్త దర్శన్‌పై విజయలక్ష్మి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











