Don't Miss!
- News
బీజేపీ కోసం తెలంగాణలో పవన్‌కల్యాణ్ రాజకీయం??
- Sports
వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పునీత్ కోసం ఆగని చావులు..రక్తంతో లేఖరాసి మరీ... ఇప్పటి దాకా ఎంతమంది చనిపోయారు అంటే?
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ 6 రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక అభిమానులు గుండెపోటుతో చనిపోవడం, అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో పునీత్ రాజ్‌కుమార్ మృతితో మనస్తాపానికి గురైన మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మరో ఘటనలో ఒక అభిమాని గుండె ఆగి చని పోయారు. ఆ వివరాల్లోకి వెళితే

'అప్పుని' కలవడానికి వెళుతున్నా
కర్ణాటకలో తుమకూరు జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేకక మరో ఇద్దరు అభిమానులు మరణించారు. తుమకూరు రూరల్ పరిధిలోని హెబ్బూరు సమీపంలోని కోడిపాళ్యకు చెందిన భరత్(30) మంగళవారం ఉరివేసుకుని 'అప్పుని' కలవడానికి వెళుతున్నాను అంటూ రక్తంతో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అతని కళ్లను దానం చేశారు.

ఉరి వేసుకుని ఆత్మహత్య
మరో ఘటనలో పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక దావణగెరె నగరంలోని విజయనగర కాలనీకి చెందిన సీ.కుమార్ (25) అనే యువకుడు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ రాజకుమార్ అంటే ఇష్టపడేవాడని, పునీత్ నటించిన ప్రతి సినిమాను వీక్షించేవాడని, చెబుతూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఛాతిలో నొప్పి రావడంతో
మరో ఘటనలో హిరేహళ్ గ్రామానికి చెందిన 'అప్పు' శ్రీనివాస్ (33) మంగళవారం రాత్రి జిల్లా సర్వజన ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందాడు. తను దేవుడిగా భావించే పునీత్ 'దర్శనం' కోసం బెంగళూరుకు వెళ్లాడు. తిరిగి రాగానే ఆందోళనకు గురై పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందాడు.

ప్రేమ వివాహం
శ్రీనివాస్ ది సినిమాల్లోలాగే ట్విస్ట్‌లతో జరిగిన ప్రేమ వివాహం అని, అతను పునీత్ సినిమాలు విడుదలైన రోజే చూసే వాడని అతని సన్నిహితులు చెప్పారు. ''గత ఏడాది సిద్దగంగ మఠానికి చెందిన శ్రీ శివకుమార స్వామీజీ మరణించినప్పుడు ఎంత బాధ పడ్డామో పునీత్ చనిపోయినప్పుడు కూడా అంత బాధ కలిగిందని వారు వెల్లడించారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దని
మరోపక్క ఆత్మహత్యలు చేసుకోవద్దని అభిమానులకు శివన్న విజ్ఞప్తి చేశారు. మనమందరం బాధలో ఉన్నాము, అది అంగీకరించాలి, తమ్ముడు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిద్దాం ఆ విధంగా అప్పుని బ్రతికించుకుందాం, మీ కుటుంబానికి మీరే ముఖ్యం, మాకు మీరే ముఖ్యం. దయచేసి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునే నిర్ణయాలు తీసుకోవద్దు'' అని శివరాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుపై
ఇక వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్‌కి పునీత్ పేరు పెట్టడం గురించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రచారాలకు మద్దతిద్దాం. ముందుకెళ్దాం అని ఆయన అన్నారు. ఇక అప్పు మృతిపై సమగ్ర విచారణ కోసం సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై శివన్న కుమార్ స్పందించారు. ''తమ్ముడు ఇప్పుడు మనమధ్య లేడు, దయచేసి, ఇప్పుడు అదెలా ఏంటో మాట్లాడి బాధ పెట్టద్దు అని ఆయన కోరారు. ఇక లెక్కల ప్రకారం ఇప్పటిదాకా 15 మంది పైగా పునీత్ మరణంతో బాధను తట్టుకోలేక మరణించినట్టు అంచనా.