నీవు లేకుండా బతకలేక పోతున్నాం.. వెంటనే తిరిగా సోదరా.. చిరంజీవి సర్జా మృతిపై ఎమోషనల్‌గా

కన్నడ నటుడు చిరంజీవి సర్జా మృతితో స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిరంజీవి సర్జా తమతో లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కుటుంబ సభ్యుల పరిస్థితి చెప్పడం కష్టమే అనేది సోషల్ మీడియాలో వాళ్లు స్పందిస్తున్న తీరుతో స్పష్టమవుతున్నది. యాక్షన్ కింగ్ అర్జున్ సమీప బంధువు చిరంజీవి సర్జా జూన్ 7వ తేదీన బెంగళూరులోని సాగర్ అపోలో హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలో చిరంజీవి సర్జా సోదరుడు ధ్రువ్ సర్జా భావోద్వేగమైన పోస్టుతో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా మార్చారు.

 విడదీయలేని బంధంతో

విడదీయలేని బంధంతో

సర్జా కుటుంబంలో చిరంజీవి, ధ్రువ్ మధ్య ఉన్న బంధం విడదీయలేనిదిగా చెప్పుకొంటారు. బాల్యం నుంచి వారి మధ్య వెలకట్టలేని విధంగా ప్రేమానురాగాలు ఉన్నాయనే విషయం పలు సందర్బాల్లో స్పష్టమయ్యాయి. తాజాగా తన ఫామ్‌హౌస్‌లోనే అంత్యక్రియలు పూర్తి చేయడం తన తన సోదరుడిపై ప్రేమకు అద్ధం పట్టింది.

 బాల్యంలోనూ, ఇప్పుడు ఒకేలా

బాల్యంలోనూ, ఇప్పుడు ఒకేలా

చిరంజీవి సర్జా మరణానికి కొద్ది రోజుల ముందు ధ్రువ్ సర్జా తన సోదరులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ ఫోటోను షేర్ చేశారు. చిన్నతనంలో దిగిన ఫోటోను, ఇటీవల దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. బాల్యంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం కదా. మీరు ఏమంటారు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషాన్ని పంచుకొన్నారు.

మీరు చిరంజీవియే

మీరు చిరంజీవియే

ఇటీవల చిరంజీవి మరణాన్ని తట్టుకోలేని బాధలో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ ఓ ఎమోషనల్ పోస్టును ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారు. చిన్నతనంలో ధ్రువ్, చిరంజీవి సర్జాతో దిగిన ఫోటోను షేర్ చేసి తన ప్రేమను వ్యక్తం చేశారు. చిరంజీవి అంటూ కామెంట్ పెట్టి ఆ పోస్టును ఎమోషనల్‌గా మార్చారు.

Recommended Video

#HBDNBK Birthday Special: Caricature Pic Of Chiru Balayya & Total Tolywood Heroes Goes Viral
నీవు లేకుండా ఉండలేకపోతున్నాం

నీవు లేకుండా ఉండలేకపోతున్నాం

ఇక తాజాగా ధ్రువ్ ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన మరో పోస్టు భావోద్వేగానికి గురిచేస్తున్నది. సోదరా నీవు లేకుండా ఉండలేకపోతున్నాం. బతకడం చాలా కష్టంగా ఉంది. నీవు వెంటనే తిరిగి రా. నీవు లేకుండా ఇక్కడ ఉండటం చాలా విషాదంగా ఉంది అంటూ ధ్రువ్ సర్జా ఓ కామెంట్‌ పెట్టడంతో పోస్టు ఎమోషనల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X