Don't Miss!
- News
త్రిపురలో ముక్కోణపు పోరు- బీజేపీ ప్రత్యర్ధులుగా లెఫ్ట్-కాంగ్రెస్, తిప్రామోథా !
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ విషయంలో వాడి వేడి చర్చ.. బీసీసీఐకి పాక్ స్ట్రాంగ్ వార్నింగ్?
- Finance
SBI Q3 Result: రికార్డు లాభాలను నమోదు చేసిన స్టేట్ బ్యాంక్.. అంచనాలను తలదన్నేలా..
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpa Raj The Soldier గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం.. అర్జున్ మేనల్లుడి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
నిర్మాతగా బొడ్డు అశోక్ టాలీవుడ్‌లోకి అడుగు పెడుతూ కన్నడ స్టార్స్ ధ్రువ సర్జా, రచిత రామ్, హరిప్రియ జంటగా రూపొందించిన చిత్రం పుష్పరాజ్.. ది సోల్జర్. ఈ చిత్రాన్ని ఆర్‌యస్ ప్రొడక్షన్స్ ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 19న గ్రాండ్‌గా రిలీజ్‌కు అవుతున్నది.

పుష్పరాజ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించిన అనంతరం నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. భార్జరీ సినిమా ద్వారా అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా కన్నడ రంగంలో అడుగుపెట్టారు. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన పుష్పరాజ్ .. ది సోల్జర్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి అని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప సినిమాతో పుష్పరాజ్ పేరు చాలా పాపులర్ అయింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలను ఎలాగైతే ఆదరించారో..ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆగస్టు 19న గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.