WAR 2 మూవీలో మరో సౌతిండియా స్టార్.. ఎన్టీఆర్ తమ్ముడిగా కండల వీరుడు
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. RRR చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న అతడు.. అప్పటి నుంచి భారీ ప్రాజెక్టులనే చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో తారక్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.
చాలా కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన 'వార్' మూవీకి ఇది కొనసాగింపుగా రాబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతోన్న 'వార్ 2' మూవీకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. మొదట టెస్ట్ షూట్ చేయగా.. తర్వాత హీరోలపై చిత్రీకరణ జరిపారు. ఇందులో ఎన్టీఆర్ కూడా ఓ షెడ్యూల్‌లో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చాడు.
ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ హీరోలు నటిస్తోన్న 'వార్ 2' మూవీని హై రేంజ్ యాక్షన్‌తో తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఇండియా వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు మరికొన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి నటీనటులను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'వార్ 2' మూవీ కోసం కన్నడ హీరో ధృవ సర్జాను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. కండలు తిరిగిన దేహంతో ఉండే ఈ హీరో.. ఎన్టీఆర్ తమ్ముడి పాత్రను చేస్తున్నాడని తెలిసింది. త్వరలోనే ధృవ సర్జా 'వార్ 2' మూవీ చిత్రీకరణలో భాగం కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై హైప్ మరింతగా పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలిసింది. ఇందులో ఆలియా భట్, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











