Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ప్రియురాలితో ప్రముఖ హీరో ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో వైరల్ (ఫోటోస్)
యాక్షన్ స్టార్ అర్జున్ సార్జా బంధువు, కన్నడ యువ నటుడు ధృవ సార్జా నిశ్చితార్థం తన ప్రియురాలితో బెంగుళూరులో ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితురాలు ప్రేరణను ధృవ త్వరలో పెళ్లాడబోతున్నారు. బెంగుళూరులో జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకకు అర్జున్ సార్జాతో పాటు పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు. కర్నాటకలో యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ధృవ ఒకరు. సోషల్ మీడియాలో ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అయ్యారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను విష్ చేస్తూ ట్వీట్స్ వర్షం కురిపిస్తున్నారు.

చూడముచ్చటైన జంట
ఈ ఫోటో చూసి ధృవ భారీగా జుట్టు, గెడ్డం పెంచి కాస్త తేడాగా ఉన్నాడని అనుకోవద్దు. తాను నటిస్తున్న ఓ సినిమా కోసమే అతడు ఈ లుక్‌లో ఉన్నాడు. అవి తీస్తే ధృవ చాలా హాండ్సమ్‌గా ఉంటాడని, ఇద్దరూ చూడముచ్చటైన జంటగా కనిపిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.

చిన్నాటి స్నేహితురాలు
అర్జున్, ప్రేరణ మధ్య చిన్ననాటి నుంచి మంచి స్నేహం ఉంది. తమ స్నేహాన్ని ప్రేమ బంధంగా మార్చుకుని త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు.

హీరో దర్శన్‌తో కలిసి
మరో కన్నడ స్టార్ దర్శన్... ధృవ-ప్రేరణ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరైన త్వరలో దంపతులు కాబోతున్న ఈ జంటను విష్ చేశారు.

అర్జున్‌తో ధృవ-ప్రేరణ
అర్జున్ సార్జాతో కలిసి... ధృవ-ప్రేరణ దంపతులు. చిన్నప్పటి నుంచి అంకుల్ అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగిన ధృవ, ఆయన బాటలోనే కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.