Don't Miss!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- News
Union Budget 2023: రైల్వే ప్రయాణికులు కోరుకుంటోన్నది ఇదే..!!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
వివాదంలో పొగరు మూవీ.. బ్రహ్మణ కమ్యూనిటీ ఆగ్రహం.. ఏం జరిగిందంటే!
కన్నడ హీరో ధ్రువ్ సర్జా నటించిన పొగరు చిత్రం విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రంలోని పాటలు అత్యంత పాపులారిటీ చెందడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఓ వైపు ఈ సినిమా భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్తుంటే.. మరో వైపు ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది.
పొగరు చిత్రంలో తమ కమ్యూనిటిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బ్రాహ్మణుల సంఘం ఫిర్ాయదు చేసింది. తమ కులాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, కొన్ని సన్నివేశాలు అభ్యంతరంగా ఉన్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బ్రాహ్మణుల ఫిర్యాదు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. రాష్ట్ర బ్రహ్మిన్ డెవలప్‌మెంట్ బోర్డుతో విచారణ చేపట్టింది. పొగరు చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే వెంటనే తొలగించాలని సూచించింది. అయితే పొగరు సినిమాకు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.