కన్నడ ఇండస్ట్రీలో శెట్టి డామినేషన్.. దీక్షిత్ శెట్టి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు నటించారు.

ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహబ్ మ్యూజిక్ అందించారు. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫిని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, రామకృష్ణ, మోనిక ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటుడు దీక్షిత్ శెట్టి సినిమా ప్రమోషన్స్‌లో ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..

Actor Dikshit Shetty opens up

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్‌లో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. నా కెరీర్‌ ఆరంభంలో సుమారుగా 300 స్క్రిప్టులు విన్నాను. దసరా, తమిళ సినిమా తర్వాత నాకు అన్ని భాషల నుంచి అవకాశాలు వచ్చాయి. రక్షిత్ శెట్టి నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన మరికొందరి సహకారంతో నా కెరీర్‌ను బెటర్‌గా తీర్చి దిద్దికొన్నాను అని అన్నారు.

కన్నడ సినిమాపై శెట్టి డామినేషన్‌ గురించి ఆయన స్పందించారు. మంగళూరు, కుందాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన శెట్టి వర్గం వారు ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నారనే వాదన తప్పు. అంతకు ముందు చాలా మంది హీరోలు కన్నడ సినిమా పరిశ్రమకు దేశీయంగా గుర్తింపు తెచ్చారు. ఎవరివల్లో గుర్తింపు రాదు. వ్యక్తిగతం కష్టపడితేనే కెరీర్‌పరంగా పాపులారిటీ వస్తుంది అని దీక్షిత్ శెట్టి అన్నారు.

మంగళూరు, కుందాపుర ప్రాంతాల్లో కళలకు, సంస్కృ‌తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్లే ఆ ప్రాంతం నుంచి కళారంగం వైపు ఆసక్తి చూపుతూ సినిమా పరిశ్రమ వైపు ఆకర్షితులవుతున్నారు. శెట్టి అనేది బ్రాండ్ కాకుండా.. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కష్టపడి ఎదగాలి. రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి స్వయంకృషితోనే ఎదిగారనే విషయాన్ని దీక్షిత్ శెట్టి గుర్తు చేశారు.

కన్నడ సినిమా పరిశ్రమకు ప్రశాంత్ నీల్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అంతకు ముందే ఉపేంద్ర లాంటి వాళ్లు 90వ దశకంలో అద్బుతమైన సినిమాలు తీసి.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. రాజ్ కుమార్, విష్ణువర్ధన్, శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ లాంటి కన్నడ చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు తెచ్చారు. పేరుతో సంబంధం లేకుండా కష్టపడి వారంటే నాకు అత్యంత గౌరవం అని దీక్షిత్ శెట్టి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X