ప్రముఖ దర్శకుడు మరణంపై రూమర్లు.. సినీ పరిశ్రమను కుదిపేసిన వార్త
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు ద్వారకేష్ మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. దాంతో వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరుగుదలతో వార్త కథనాలపై నియంత్రణ కరువైందనే విమర్శలకు ఈ ఘటన మరింత బలం చేకూరింది. ద్వారకేష్ కుటుంబానికి సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతుండటంతో ప్రముఖ దర్శకుడు చైతన్య కేఎం సోషల్ మీడియాలోస్పందించారు. ఆయన తన మరణంపై సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

ద్వారకేష్ మరణంపై
నటుడు, దర్శకుడు ద్వారకేష్ మరణ వార్త మమల్ని చాలా బాధించింది. ఆయన మరణం గురించి క్లారిటీ ఇవ్వాలని అనుకొంటున్నాను. ద్వారకేష్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దయచేసి రూమర్లను ప్రచారం చేయవద్దు అని దర్శకుడు చైతన్య కేఎం ట్విట్టర్‌లో వివరించారు. దయచేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంతాప సందేశాలను తొలగించాలని సూచించారు.

దయచేసి రూమర్లు ప్రచారం చేయొద్దు
అనంతరం స్వయంగా ద్వారకేష్ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ప్రతీ ఒక్కరికి నమస్తే.. మీ కర్ణాటక కుల్ల. నేను సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లను నమ్మకండి. ప్రజల, ప్రేక్షకుల దీవెనలు, ప్రార్థనల వల్ల నేను క్షేమంగా ఉన్నాను. ఆరోగ్యంతోనే ఉన్నాను అంటూ ఓ వీడియోలో వెల్లడించారు.

కన్నడ పరిశ్రమను కుదిపేసిన వార్త
సినీ ప్రముఖుడు ద్వారకేష్ మరణ వార్త సోమవారం సాయంత్రం నుంచి కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. వాట్సప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టింగులతో హెరెత్తాయి. దాంతో ద్వారకేష్ కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు ఆయన మరణంపై వీలైనంత వరకు క్లారిటీ ఇచ్చారు. దాంతో అభిమానులకు కొంత ఉపశమనం కలిగింది.

నటుడు, దర్శకుడు ద్వారకేష్ గురించి
కన్నడ పరిశ్రమలో ద్వారకేష్‌కు మంచి ప్రజాదరణ ఉంది. ఆయనను ప్రచండ కుల్ల అని అభిమానులు ప్రేమగా పిలుచుకొంటారు. దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మేయర్ ముత్తన్న, కుల్లా ఏజెంట్ 000, గురు శిష్యారు అత్యం ప్రజాదరణ పొందిన చిత్రాలుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











