డైరెక్టర్‌గా చిరంజీవి పెట్టిన పునర్జన్మ.. షాడోగా ఉన్న నా మీద మెగాస్టార్ వెలుగులు.. మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు ఆగస్టు 6న శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకలో చిరంజీవితో సహా అల్లు అరవింద్, దర్శకుడు మెహర్ రమేష్, కీర్తి సురేష్, సుశాంత్ లతో పాటు.. పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు మెహర్ రమేష్.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
మెహర్ రమేష్ మాట్లాడుతూ... మెగాస్టార్ ఫ్యాన్స్... మీలోంచి వచ్చినవాడినే.. నేను ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం. అన్నయ్యతో సినిమా చేయడం నా అదృష్టం. షాడోలో ఉన్న నా మీద మెగాస్టార్ అనే వెలుగు నా మీద పడింది. నాకు డైరెక్టర్ గా అన్నయ్య ఇచ్చిన పునర్జన్మ ఇది. సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు.. అన్నయ్యతో సినిమా తీయాలని నిర్మాత అన్నారు. చేస్తాను సార్ అని అన్నాను. నా కలను నిజం చేశారు. థ్యాంక్యూ సోమచ్ అని చెప్పుకొచ్చాడు.

చిరంజీవికి నేను తమ్ముడు అవుతాను.. ఓ బంధుత్వం ఉంది. మా అన్నయ్య దుర్గబాబు... చిరంజీవి గారికి పీఏగా వర్క్ చేశారు. అన్నయ్య పేరు తలవని రోజు లేదు. ఓ గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు తర్వాత ఓ సినిమా వస్తే ఎలా ఉంటుందో... అలా భోళా శంకర్ సినిమా తీశాం. మేం చిరంజీవి గారి ఫ్యాన్స్ కాదు.. లవర్స్. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు.. సపోర్ట్ ఇచ్చారు. వారి సపోర్ట్ తోనే ఈ సినిమా తీయగలిగాను. అన్నయ్య ఈ జన్మ సరిపోదు.. మీ మీద నా అభిమానం చూపించుకోవడానికి ఈ జన్మ సరిపోదు. మా అమ్మ నాన్న ఎక్కడున్నా... సంతోషిస్తారు అంటూ ఎమోషన్ అయ్యారు మెహర్ రమేష్.
అన్నయ్యను ఏమైనా అంటే తట్టుకోలేం. అన్నయ్య లాంటి ప్రేమ మూర్తిని ఎక్కడా చూడలేదు. అన్నయ్య దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అన్నయ్య ఓ ఎన్ సైక్లోపిడియా, నిఘంటువు.. ఆయనతో సినిమా తీయడం నా అదృష్టం. అల్లు అరవింద్ గారు, అనిల్ సుంకర గారు... వీళ్లకు స్పెషల్ థ్యాంక్స్. వాల్తేరు వీరయ్య సృష్టించిన రికార్డ్స్ అన్ని ఈ సినిమా కొల్లగొట్టబోతుంది. థ్యాంక్యూ ఆల్.. అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎమోషన్ లో మా చెల్లి గురించి మరిచిపోయాను. మెగాస్టార్ పక్కన మహానటి ఉండటం కరెక్ట్. తను నాకు నిజంగా చెల్లి అయిపోయింది. డేట్స్ ఇవ్వడమే కాదు.. తను చాలా సపోర్ట్ చేసింది. చిరంజీవి గారికి ఇష్టమైన హీరోయిన్.. కీర్తి సురేష్.. షూటింగ్ కీర్తి సురేష్ ను లేకపోతే మిస్ అయ్యేవారు. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు. నేను ఆయన పెళ్లికి వెళ్లాను. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్లే. నన్న అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది కూడా అన్నయ్య. గ్యాంగ్ లీడర్ సినిమాకు లాస్ట్ షార్ట్ ఆయన దర్శకత్వంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశానని చెప్పారు.


Click it and Unblock the Notifications











