KGF Chapter 2 ఎడిటర్ వయసు ఎంతో తెలుసా? టీనేజ్‌లోనే ఇండియా బిగ్గెస్ట్ మూవీకి ఎడిటింగ్!

సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన KGF Chapter 2 ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొంటున్నది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. తమ టాలెంట్‌తో కేజీఎఫ్ చిత్రాన్ని ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా మలిచిన టెక్నిషియన్లను ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలను ఎమోషనల్‌గా, తెర మీద నుంచి దృష్టిని పక్కకు మరల్చకుండా చేసిన ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఉజ్వల్ గురించి ఎలాంటి చర్చ జరుగుతున్నదంటే..

 KGF Chapter 2

KGF Chapter 2

KGF Chapter 1 గానీ, KGF Chapter 2 మూవీ గానీ.. అద్భుతంగా నిలువడానికి సాంకేతిక నిపుణుల కృషి మాటల్లో చెప్పలేనది. అయితే తెర వెనుక ఉండి సినిమాను బిగ్గెస్ట్ మూవీగా మలచిన వారిలో ఉజ్వల్ కులకర్ణి ఒకరు. ఉజ్వల్ కులకర్ణి ఈ సినిమాకు ఎడిటర్‌గా అద్భుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రేక్షకులు అభిమాన నీరాజనం పడుతున్నారు.

19 సంవత్సరాలు మాత్రమే

19 సంవత్సరాలు మాత్రమే


అయితే ఉజ్వల్ కులకర్ణి అంటే వయసులో పెద్దవాడు కావొచ్చనో.. లేదా బాగా అనుభవంతో రాటుదేలి ఉన్నాడని అనుకొంటే పొరపాటే. కేజీఎఫ్ లాంటి అత్యంత పాపులారిటీ సంపాదించుకొన్ని సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన ఆయన వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ తెర మీద ఆయన పనితనం చూస్తే.. పుష్కలంగా అనుభవం సంపాదించి.. చేయి తిరిగిన టెక్నిషియన్‌గా కనిపిస్తారు. చిన్నతనంలోనే అమోఘమైన పనితనాన్ని చాటుకొన్నారు.

 షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేస్తూ..

షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేస్తూ..


KGF Chapter 2 సినిమా ఆఫర్ రాకముందు.. షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేయడం.. ఫ్యాన్స్ బేస్డ్ వీడియోలను ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడు. అయితే యూట్యూబ్‌లో ఉజ్వల్ ప్రతిభను చూసిన ప్రశాంత్ నీల్ తొలుత కేజీఎఫ్1 చిత్రంతో భాగస్వామ్యం చేశారు. కేజీఎఫ్1 సినిమా టీజర్ కట్ చేయడానికి తీసుకొన్న ప్రశాంత్ నీల్.. ఉజ్వల్ ప్రతిభ చూసి.. ఏకంగా ఎడిటర్ చేసేశాడు.

 ఉజ్వల్ టాలెంట్‌ మైండ్ బ్లోయింగ్‌

ఉజ్వల్ టాలెంట్‌ మైండ్ బ్లోయింగ్‌


ప్రశాంత్ నీల్‌ అందించిన ప్రోత్సాహాన్ని చక్కగా ఉపయోగించుకొన్న ఉజ్వల్ కులకర్ణి.. కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రాన్ని బ్రహ్మండంగా కూర్పు చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎడిటర్ ఎవరు? అనే ఆసక్తిని పెంచింది. ఇక KGF Chapter 2 సినిమా చూస్తే ఉజ్వల్ టాలెంట్‌ మైండ్ బ్లోయింగ్‌ అవ్వడం ఖాయం. సినిమాకు సంబంధించిన ఎలివేషన్, బిల్డప్ షాట్స్‌ను ఎడిటింగ్ చేసి కేక పెట్టించాడు.

వయసు అనే జస్ట్ నంబర్ మాత్రమే అంటూ

వయసు అనే జస్ట్ నంబర్ మాత్రమే అంటూ


KGF Chapter 2 సినిమా రిలీజ్ తర్వాత ఉజ్వల్‌ కులకర్ణిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ సినిమా రంగంలో అతిపెద్ద సినిమా కేజీఎఫ్‌కు ఎడిటింగ్ చేసిన ఉజ్వల్ వయసు 19 సంవత్సరాలు. వయసు అనే జస్ట్ నంబర్ మాత్రమే. టాలెంట్ మాత్రమే ముఖ్యం అని ఉజ్వల్ నిరూపించాడు. కాబట్టి మీరు కూడా యవ్వనాన్ని మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలా మలుచుకొండి అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

Recommended Video

KGF Chapter 2 Inayath Khaleel ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రే| Filmibeat Telugu
ప్రశాంత్ నీల్ మరో ప్రయోగం..

ప్రశాంత్ నీల్ మరో ప్రయోగం..

ఇదిలా ఉంటే.. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడకు సంబంధించి మరో ఆసక్తికరమైన స్టోరి. వాస్తవానికి భువన్ గౌడ స్టిల్ ఫోటోగ్రాఫర్. ప్రశాంత్ నీల్‌తో చాలాకాలంగా పనిచేస్తున్నాడు. అయితే ప్రశాంత్ సినిమాకు పనిచేసే ఓ సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడంతో.. భువన్ గౌడకు సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కలర్ ప్యాలెట్, తెరకెక్కించిన ప్రతీ ఫ్రేమ్ హాట్ టాపిక్‌గా మారింది. టాలెంట్‌ను పసిగట్టడంలో ప్రశాంత్ నీల్‌ది అందవేసిన హస్తం అని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X