Prashanth Neel: ప్రశాంత్ నీల్ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ సినీ రంగానికి చెందిన ఈయన పాన్ ఇండియా డైరెక్టర్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఆయనలా ఇప్పటి వరకు ఎవరూ సినిమాలు తీయలేరని కూడా చెప్పారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

2014లో ఉగ్రమ్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈయన ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దేశం మొత్తం గర్వించదగ్గ సినిమా తీసి బారక్సాఫీసును బద్ధలు కొట్టాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2, సలార్ తో మళ్లీ సూపర్ హట్ కొట్టాడు. ప్రస్తుతం సలార్ 2 కూడా తీసేందుకు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం బగీరా అనే సినిమాకు ఓ కథను అందించారు.

Do You Know Who is The All Time Favourite Director For Prashanth Neel Check Details

ఇలా తీసిన నాలుగైదు సినిమాలతోనే సూపర్ సక్సెస్ ను సాధించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ నీల్ తాజాగా ఓ కన్నడ సినీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా తన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో చెప్పారు. తాను కన్నడ కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్పట్లేదని ముందుగా వివరించి.. ఆ తర్వాత తన ఫేవరెట్ డైరెక్టర్ నేమ్ చెప్పాడు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్రనే తన ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్.

ఉపేంద్ర చాలా వైవిధ్యం చూపిస్తారని.. ఆయన తెరకెక్కించిన ఏ, ఓం, ష్ వంటి విభిన్నమైన సినిమాలు చూస్తేనే ఆయన టాలెంట్ ఏంటో అర్థం అవుతుందని చెప్పారు. డైరెక్షన్ లో ఆయన స్టైలే వేరని చెప్పుకొచ్చారు. అద్భుతమైన సినిమాలను 1990లోనే తెరకెక్కించిన ఉపేంద్రకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన డైరెక్షన్ మాత్రమే కాకుండా నటుడిగానూ తెగ ఆరాధిస్తుంటారు. అలాంటి హీరో ప్రశాంత్ నీల్ ఫేవరెట్ అని చెప్పడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా ఉప్పీ ఫ్యాన్స్ అయితే తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

Do You Know Who is The All Time Favourite Director For Prashanth Neel Check Details

1992లో ఉపేంద్ర తర్లే నన్ మగ అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ష్, ఓమ్, ఆపరేషన్ అంత, ఓకాంరం, ఏ, స్వస్తిక్, ఉపేంద్ర, సూపర్, ఉప్పి2, ఐ లవ్ యూ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా అనేక సినిమాల్లో హీరోగా నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X