KGF Chapter 2 రైట్స్ కోసం రికార్డు ధర: హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. స్టైలిష్ హీరో యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇక, ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు అవన్నీ దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
'కేజీఎఫ్ చాప్టర్ 2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా ప్రాంతాల పంపిణీ హక్కులు కూడా అమ్ముడు పోయాయి. ఈ క్రమంలోనే తాజాగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం రికార్డు స్థాయి మొత్తాన్ని కూడా వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫిగర్ ఎంతో తెలియకపోయినా.. ఇది తమిళంలో విడుదలయ్యే చిత్రాలకు సమానమైన ధర అని టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రం రాఖీ భాయ్‌కు, అధీరాకు మధ్య జరిగే పోరాటంతో తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











