సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. టీవీ నటి అరెస్ట్.. ప్రముఖ డైరెక్టర్‌ను ప్రశ్నించిన పోలీసులు

బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా ఆందోళన వ్యక్తమవుతుంటే.. మరో పక్క కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్ బయటకు రావడం సంచలనం రేపుతున్నది. డ్రగ్ మాఫియాతో తో లింకులు బయటపడిన నేపథ్యంలో రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పలుచోట్ల దాడులు నిర్వహించగా సినీ ప్రముఖులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నార్కోటిక్ అధికారుల విచారణకు సినీ ప్రముఖుడు హాజరుకావడం సెన్సేషన్‌గా మారింది. కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధాల గురించి..

Recommended Video

MMOF Telugu Movie Trailer || J D Chakravarthy || Akshatha || Manoj Nandan || Akshitha || Benerjee
 టెలివిజన్ నటి అరెస్ట్

టెలివిజన్ నటి అరెస్ట్

కన్నడ సినిమా పరిశ్రమపై ఎన్సీబీ అధికారులు ఓ పక్క దాడుల చేస్తూ ఉండగానే.. పోలీసులు టెలివిజన్ నటి అనిఖా డీని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో ఆమెను అరెస్ట్ చేయడం కన్నడ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసంది. ఆమెతో పలువురు నటులుకు, మ్యూజిక్ డైరెక్టర్లకు సంబంధాలు ఉన్నాయనే విషయం షాక్ గురిచేసింది.

ప్రముఖ డైరెక్టర్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ

ప్రముఖ డైరెక్టర్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ

టెలివిజన్ నటి అరెస్ట్ తర్వాత కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే మీడియా కథనాల ఆధారంగా డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్‌కు బెంగళూరులోని ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. డ్రగ్ ఆరోపణల మధ్య నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బెంగళూరు పోలీసుల ముందు హాజరయ్యారు. కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం గురించిన తనకు తెలిసిన సమాచారాన్ని అందించినట్టు సమాచారం.

 డ్రగ్స్ మాఫియా గురించి సమాచారం ఇవ్వండి

డ్రగ్స్ మాఫియా గురించి సమాచారం ఇవ్వండి

ఇంద్రజిత్‌ లంకేష్‌ను విచారించిన తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్ వాడకం పట్ల తన అవగాహన మేరకు కొంత సమాచారం అందించారు. ఇలాంటి విషయంలో ఎవరికైన సమాచారం తెలిసినట్టయితే మాకు చేరవేయండి. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది అని తెలిపారు.

15 మంది యాక్టర్లకు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు

15 మంది యాక్టర్లకు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లకు

అయితే ఇంద్రజిత్ లంకేష్‌ను ప్రశ్నించగా కన్నడ సినీ పరిశ్రమకు డ్రగ్స్ మాఫియాకు సంబంధాలున్నాయనే విషయం మరింత స్పష్టమైనట్టు సమాచారం. దాదాపు 15 మంది టాప్ యాక్టర్లకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయనే విషయం బయటకు వచ్చింది.

చిరంజీవి సర్జా మరణం తర్వాత

చిరంజీవి సర్జా మరణం తర్వాత

సినీనటుల డ్రగ్స్‌ వాడకంపై గతంలో ఇంద్రజిత్ లంకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణించిన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మంది నటులు డ్రగ్స్ వినియోగిస్తున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల సరఫరా బెంగుళూరులో ఎక్కువగానే ఉంది అని డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్ హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X