డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్.. ఆమె వెనకున్న మాజీ ముఖ్యమంత్రి ఎవరు?
కన్నడ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వివాదం ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరోయిన్స్ సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో వారి కాల్స్ డేటా ఆధారంగా ఇప్పటికే కొన్ని సాక్ష్యాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే వారు డ్రగ్స్ వాడినట్లు గాని, సరఫరా చేసినట్లు గాని ఇంకా నేరం చేసినట్లు ఋజువు కాలేదు. మరోవైపు పోలీసు అధికారులపై ఈ కేసు విషయంలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

డ్రగ్స్ వ్యవహారంలో టీవీ యాంకర్
ఆ కేసు కొనసాగుతున్న సమయంలో మరో యాంకర్ పేరు వైరల్ గా మారింది. టీవీ యాంకర్ అనుశ్రీకి డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయని అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆమెకు సహాయం చేస్తున్నాడనే రూమర్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ కేసు విషయంలో చేస్తున్న కామెంట్స్ అనేక రకాల అనుమానాలకు దారి తీస్తున్నాయి.

ఆమెకు మాజీ సీఎం సహాయం చేస్తున్నాడు
యాంకర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు కన్నడ మీడియాలో ఇప్పటికే అనేక రకాల కథనాలు రాగా ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అనుశ్రీకి ఒక మాజీ సీఎం సహాయం చేస్తున్నాడని, అలాగే ఆమెకు సీక్రెట్ గా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం అందిందని కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

యాంకర్ అనుశ్రీకి ఫోన్ చేసింది ఎవరు
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నట్లు చెబుతూ వారిలో యాంకర్ అనుశ్రీకి ఫోన్ చేసింది ఏవరనే విషయం వీలైనంత త్వరాగా బయటపెట్టాలని కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం కుమారస్వామి మాత్రమే కాకుండా మరికొందరు రాజకీయ నాయకులు కూడా అనుశ్రీ వెనుక ఒక మాజీ సీఎం ఉన్నాడని ఇదే తరహాలో కామెంట్స్ చేస్తున్నారు..
Recommended Video

సినీ తారలపై స్పెషల్ ఫోకస్
అనుశ్రీ తనపై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక వీడియో విడుదల చేసిన ఆమె తనపై కావాలనే కొందరు కామెంట్స్ చేస్తున్నారని అసలు డ్రగ్స్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబందం లేదని వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం కర్ణాటక పోలీసులు కొంతమంది సినీ తారలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిని విచారించడానికి సమన్లు కూడా ఆదజేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











