రష్మికతో బ్రేకప్: రక్షిత్‌ గ్రేట్.. హుందాగా వ్యవహరించావు.. మీడియాను పట్టించుకోకు.. సందేశాల వెల్లువ

Recommended Video

Rakshit Shetty Emotionally Posted A Letter To Protect Rashmika

కన్నడ తారలు రక్షిత్‌శెట్టి, రష్మిక్ మందన్న బ్రేకప్ వార్తలు మీడియాలో సంచలనం రేపాయి. వీరి నిశ్చితార్థం రద్దు కావడం వెనుక చాలా కారణాలు వినిపించాయి. మీడియాలో విభిన్న కథనాలు వినిపించడంతో రష్మిక తల్లి సుమన్ మందన్న ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రక్షిత్ శెట్టి కూడా స్పందించి తగిన వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో రష్మికను గానీ, మరొకరిని గానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇలాంటి ఘటనతో మనస్థైర్యాన్ని కోల్పోయిన రష్మికకు అండగా నిలిచారు. ఆమె జీవితాన్ని ప్రశాంతంగా గడపనివ్వండి అంటూ రక్షిత్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. రక్షిత్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుపై అభిమానులు, నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మీడియాను పట్టించుకోకు

మీడియాను పట్టించుకోకు

మీడియా కథనాలను పట్టించుకోకు. ప్రతీ సెలబ్రిటీకి వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. వారికి సంబంధించిన జీవితంలోకి ఎవరూ చొరపడకూడదు. ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగితే వారే వెల్లడిస్తారనే విషయాన్ని మీడియా మరిచిపోతున్నది. అనేక రూమర్లను ప్రచారం చేస్తూ మానసికంగా వేధించడం సరికాదు అని ఓ నెటిజన్ అన్నారు.

మీ నిర్ణయమే ఫైనల్

మీ నిర్ణయమే ఫైనల్

రక్షిత్ సర్.. మీ ఆలోచనలు, మీ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్లండి. ఎవరి అభిప్రాయలను పట్టించుకోకండి. మీ చుట్టూ ప్రజలు, ఇతరులు మిమ్మల్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు మనసాక్షి ఏది చెబితే దాని ప్రకారం వెళ్లండి అని మరో నెటిజన్ అన్నారు.

 వ్యక్తిగత జీవితంలోకి

వ్యక్తిగత జీవితంలోకి

ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అనేది మీ వ్యక్తిగత వ్యవహారం. ఏదైనా జరిగితే దానికి మీరే బాధ్యలు. మీ అంతట మీరే పరిష్కరించుకోవాలి. మీడియాను పట్టించుకోవద్దు. నటుడిగా, డైరెక్టర్‌గా ఇష్టపడుతాం. కానీ మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో మాకు అనవసరం అని ఓ అభిమాని పేర్కొన్నాడు.

మీ కెరీర్‌పై దృష్టిపెట్టండి

మీ కెరీర్‌పై దృష్టిపెట్టండి

ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ గురించి మీడియాలో వార్తలు చూశాను. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ కెరీర్‌పై దృష్టిపెట్టండి. మీకు జరిగిన దానికి బాధపడుతున్నాను. మీరంటే గౌరవం. ఈ సమయంలో మీరు మనోనిబ్బరంతో ఉండాలి. మీ ఇద్దర్ని మళ్లీ కలిసి చూడాలని కోరుకొంటున్నాం.

మీ స్పందన భేష్

మీ స్పందన భేష్

బ్రేకప్ విషయంపై మీ స్పందన బాగా ఆకట్టుకొన్నది. మీ ప్రవర్తనకు అద్దం పట్టింది. మీరు చాలా మెచ్చుర్డ్‌గా వ్యవహరించారు. ఆమెకు మీరు సరైన మార్గాన్ని చూపాలి. మీరు ఆమెను మరింత అర్ధం చేసుకొన్నారు. రష్మిక మంచి నటి.. కెరీర్‌లో ఎదగనివ్వండి. మీరు ఇద్దరు స్నేహితులుగా ఉండాలి. పెళ్లి అనేది పట్టించుకొనే విషయం కాదు. రిలేషన్‌షిప్ కంటే ఫ్రెండ్‌షిప్ ముఖ్యం అని ఫ్యాన్స్ అన్నారు.

 కామెంట్ చేసే హక్కులేదు

కామెంట్ చేసే హక్కులేదు

రష్మికతో బ్రేకప్ విషయంపై మీరు స్పందించిన తీరు బాగున్నది. ఒకరి వ్యక్తిగత జీవితంపై కామెంట్ చేసే హక్కు మరొకరికి లేదు. ఒకరికి ఏదైనా జరిగితే సమాజం చూసే తీరు చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి బెంగపెట్టుకోకు అని మరో అభిమాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X