హీరో యష్‌పై నోరు పారేసుకుని యంగ్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా హీరోయిన్‌కు ఫ్యాన్స్ ఎలా బుద్ది చెప్పారంటే?
రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి స్టార్ హీరోని పట్టుకుని షో ఆఫ్ అంటూ హీరోయిన్ నోరు పారేసుకుని ఆయన అభిమానుల కోపానికి బలయ్యింది ఓ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
KGF మూవీ తో రాకింగ్ స్టార్ యష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. కేజిఎఫ్ రెండు భాగాలు కూడా ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. ఈ మూవీని చూశాక దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు యష్ పై ప్రత్యేకంగా అభిమానాన్ని పెంచేసుకున్నారు.

అయితే ఒకానొక సమయంలో యష్ షో ఆఫ్ అంటూ నోరు జారింది రష్మిక మందన్న. అవును మీరు విన్నది నిజమే. యష్ ను షో ఆఫ్ అంటూ పిలిచింది మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే నిజానికి ఆయనను అగౌరవపరచాలి అన్నది ఆమె ఉద్దేశం కాదు.
కానీ అప్పట్లో వైరల్ అయిన ఓ వీడియోలో ఇదే కనిపించింది. ఇక అసలు విషయం ఏమిటంటే 2017 లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక యష్ పై చేసిన వ్యాఖ్యలకు క్రూరంగా ట్రోలింగ్ బారిన పడింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కన్నడ చిత్ర పరిశ్రమలో మీ ప్రకారం మిస్టర్ షో ఆఫ్ ఎవరు? అంటూ సరదాగా ప్రశ్నించారు. అయితే రష్మిక మందన్న టక్కున యష్ పేరు చెప్పేసింది. నిజానికి ఇది సరదాగానే జరిగింది. కానీ కొంతమంది ఆకతాయిలు జనాలు అపార్థం చేసుకునే విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఇంకేముంది యష్ అభిమానులు వెంటనే సోషల్ మీడియా వేదికగా రష్మికను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికే ఆమెపై రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకోవడం వంటి విషయాల వల్ల పీకల వరకు కోపంగా ఉన్న కన్నడిగులు యష్ నే అంత మాట అంటావా అని ఆడేసుకున్నారు.
రష్మిక అహంకారి, అహంభావి అని ముద్ర వేసింతవరకు ట్రోలింగ్ వెళ్ళింది. దీంతో రష్మిక తనకు యష్ అంటే గౌరవం ఉందని. తను మాట్లాడింది ఒకటైతే ఆ వీడియోలో వేరేగా ఉందంటూ యష్ అభిమానులకు సారీ చెప్పింది. అప్పటికి గాని యష్ అభిమానుల కోపం చల్లార లేదు. సరదాగా ఆమె చేసిన ఒక కామెంట్ అప్పట్లో ఇంత దుమారం రేపిందిన్నమాట. ఏదైతేనేం ప్రస్తుతం రష్మిక మందన్న కెరీర్ పాన్ ఇండియా హీరోయిన్ గా పీక్స్ లో ఉంది.


Click it and Unblock the Notifications











