Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోట, బాబు మోహన్ కుమారుల తరహాలో... సినీ డిస్ట్రిబ్యూటర్ దుర్మరణం!
తిరగడానికి కార్లు ఉన్నా లక్షల ఖరీదు చేసే స్పోర్ట్స్ బైకులపై మోజు పడుతున్నారు కొందరు సినీ సెలబ్రిటీలు. అయితే ఈ బైక్ రైడింగ్ సరదా కొందరిని మృత్యువు ఒడిలోకి నెట్టివేస్తోంది. మితిమీరిన వేగం వారి ప్రాణాలు హరిస్తోంది.
2003లో బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్(26) బైక్‌పై వస్తూ జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోగా, 2010లో కోట శ్రీనివాసరావు కుమారుడు, కోట ప్రసాద్(39) బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో మరో వాహనాన్ని ఢీకొని మరణించారు. 2011లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్(19) ఔటర్ రింగ్ రోడ్డుపై తన ఖరీదైన బైక్‌తో మితిమీరిన వేగం ప్రయాణిస్తూ అదుపు తప్పి మృతి చెందాడు.

ఇదే తరహాలో... తాజాగా మరో ప్రమాదం బెంగుళూరులో సంభవించింది. ఈ ప్రమాదంలో కన్నడ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అజయ్ చందానీ ఆదివారం(జులై 14) మరణించారు. చందానీ ఇటీవలే కొత్త స్పోర్ట్స్ బైక్ సుజుకి వి స్ట్రోమ్ 650 ఎక్స్‌టి కొనుగోలు చేశాడు. ఆదివారం ఉదయం బైక్ మీద వేగంగా ఇంటికి వెళుతుండగా కన్నింగమ్ రోడ్లో అదుపుతప్పింది. పోల్‌కు ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. వెంటనే అతడిని జైన్ ఆసుపత్రికి తరలించారు. 6.30 గంటలకు ప్రమాదం జరుగగ్గా... గంటన్నరసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు.
