Martin Trailer Review: తొలి పాన్ వరల్డ్ మూవీ మార్టిన్ . ట్రైలర్‌తోనే అర్జున్, ధృవ్ సర్జా సంచలనం!
కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా ప్యాన్ వరల్డ్ మూవీ మార్టిన్‌తో సిద్దమయ్యాడు. టీజర్‌తోనే సంచలనం రేపిన ఈ యంగ్ హీరో తాజాగా ముంబైలో జరిగిన ఇండియాలో తొలి ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో దేశంలోని అన్ని భాషల మీడియా ప్రతినిధులు, యూకే, ఈజిప్ట్, కెన్యా, సౌతాఫ్రికా లాంటి దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన విషయాల్లోకి ..
ధృవ్ సర్జా నటించిన మార్టిన్ సినిమాకు లెజెండరీ యాక్టర్ అర్జున్ సర్జా రచనా సహకారం అందించారు. యాక్షన్ కింగ్ అర్జున్ అందించిన కథకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. వాసవి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాను ఉదయ్ కే మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మించారు. ఈ చిత్రంలో వైభవి శాండిల్య, అన్వేషి జైన్, అచ్యుత్ కుమార్, నిఖ్తిన్ ధీర్, నవాబ్ షా తదితరులు నటించారు.

మార్టిన్ సినిమాకు మణిశర్మ సంగీతం, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ బాధ్యతలు నిర్వహించారు. సత్యా హెగ్డే సినిమాటోగ్రఫి, కేఎం ప్రకాశ్, ఎంఎస్ రెడ్డి ఎఢిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భవిష్యత్ సినిమాకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మార్టిన్ సినిమా ట్రైలర్‌ను ఇండియాలోని ప్రధాన భాషలతోపాటు జపాన్, చైనా, అరబిక్, కొరియన్, రష్యా, స్పానిష్, మాస్కో, టర్కీ, భాషల్లో రిలీజ్ చేశారు. దాదాపు ఈ సినిమాను 18 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తొలి పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు హీరో ధృవ్ సర్జా, అర్జున్ సర్జా వివరించారు.

పాకిస్థాన్ తీవ్రవాదం బ్యాక్ డ్రాప్‌గా దేశభక్తితో కూడిన కథలో ధృవ్ సర్జా సైనికుడిగా కనిపించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్‌ను కేకపెట్టించేలా చేశారు. హీరో ఎలివేషన్స్, యాటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నాయనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది.
డోంట్ టీచ్ ఫాదర్ హౌ టూ అని ధృవ్ సర్జా చెప్పిన డైలాగ్ విజిల్స్ వేసేలా ఉందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. అక్టోబర్ 11వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇప్పటికే భారీ అంచనాలను ట్రైలర్ క్రియేట్ చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడం రికార్డుగా మారింది.


Click it and Unblock the Notifications











