మళ్లీ మాజీ సీఎం భార్య జిగేల్.. కుర్ర హీరోతో కలిసి..
కన్నడ అందాల తార, మాజీ సీఎం కుమారస్వామి గౌడ సతీమణి రాధిక వెండితెరపైన హల్‌చల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరుస సినిమాలతో ఆమె మళ్లీ బిజీగా మారబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఇప్పటికే భైరదేవీ అనే చిత్రంతో సిద్ధంగా ఉన్న రాధిక.. రంగనాయక అనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కాస్తా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే వార్త తాజాగా మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

భైరదేవీగా రాధిక
ప్రస్తుతం కన్నడలో శ్రీజై అనే దర్శకుడు రూపొందిస్తున్న భైరదేవి చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రమేష్ అరవింద్, దునియా విజయ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

రంగనాయక పాత్ర కోసం
ప్రస్తుతం జగ్గేశ్ హీరోగా దర్శకుడు గురు ప్రసాద్ రంగనాయక అనే సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం రాధిక కుమారస్వామితో సంప్రదింపులు జరిగాయట. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లే విషయం ఆగిందనేది తాజా సమాచారం.

2000 తెరపైన హల్‌చల్
ఇక రాధిక కెరీర్ గురించి ప్రస్తావిస్తే.. 2000 సంవత్సరంలో కన్నడ తెరపైకి దూసుకొచ్చారు. కొద్దికాలంలోనే గ్లామర్ క్వీన్‌గా తెరపైన ఆకట్టుకొన్నారు. విభిన్నమైన పాత్రలతో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే అందరికీ షాకిస్తూ పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Recommended Video

పెళ్లి తర్వాత రీఎంట్రీ
కెరీర్ పీక్‌లో ఉండగానే కర్ణాటక సీఎం కుమారస్వామిని పెళ్లి చేసుకొన్న రాధిక.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించారు. చిరంజీవి సర్జాతో కలిసి స్వీటి నాన్న జోడి, రుద్ర తాండవ అనే చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











