కాంతారా 2 లో లక్కీ ఛాన్స్.. ఫొటోతో లీక్ చేసిన స్టార్ హీరోయిన్!
గత ఏడాది పెద్దగా అంచినాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా పెట్టిన పెట్టుబడికి ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. ఆ సినిమాతో బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది.
ముఖ్యంగా తెలుగులో 50 కోట్లకు పైగా వసూళ్ళను అందుకోవడం విశేషం. ఇక ఇప్పుడు ఆ సినిమాకు ఫ్రీక్వల్ ను కూడా తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రిషబ్ శెట్టి నటీనటులను ఫైనల్ చేసే పనుల్లో కూడా బిజీ అవుతున్నాడు.
అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసిందే. మొదట కొంతమంది స్టార్ హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే కాంతార ఫ్రీక్వెల్ లో మాత్రం గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రైతేలా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంతార ఫస్ట్ పార్ట్ లో కొత్తమ్మాయి మానసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్రీక్వెల్లో మాత్రం ఊర్వశిని ఫిక్స్ చేశారు.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం భారీ స్థాయిలో కూడా రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఆ మధ్య తమిళ్ లో లెజెండ్ సినిమా కోసం దాదాపు 20 కోట్ల వరకు తీసుకున్నట్లుగా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కాంతార సినిమాకు కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక మొత్తానికి అయితే ఊర్వశి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని లీక్ చేసేసింది. ఇంకా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఆ ప్రకటన రాకముందే ఊర్వశి మాత్రం సోషల్ మీడియాలో హీరోతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ ప్రాజెక్టులో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా ఆమె వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











