HanuMan: హాలీవుడ్ మూవీ రికార్డు సమం చేసిన హనుమాన్.. తొలి తెలుగు చిత్రంగా ఘనత
పెద్ద పెద్ద స్టార్లు నటించలేదు.. దర్శకుడు కూడా పెద్దగా పేరున్నోడు కాదు.. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న సినిమానే 'హనుమాన్'. అంతలా ఈ చిత్రం ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకుని సెన్సేషన్ అయింది. ఆ తర్వాత కూడా ఈ మూవీ తరచూ హైలైట్ అవుతూ వచ్చింది.
ఇలా భారీ హైప్‌తో ఇది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. అదే సమయంలో హాలీవుడ్ మూవీని సమం చేసి ఔరా అనిపించింది. అసలేం అయిందో మీరే చూసేయండి!

హనుమాన్‌గా మారిన తేజ: తేజ సజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా హవానే: సూపర్ హీరో కాన్సెప్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని సంక్రాంతి కానుకంగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికితోడు బుకింగ్స్ కూడా బాగా జరగడంతో ఈ మూవీ హవాను కనిపిస్తోంది.

పెయిడ్ ప్రీమియర్స్‌తోనే: 'హనుమాన్' మూవీ జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో 11వ తేదీ నుంచే ఎప్పటిలాగే యూఎస్‌లో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. అలాగే, ఇండియాలోని చాలా ప్రధాన నగరాల్లోనూ షోలు వేయనున్నారు. ఇలా మొత్తం ఈరోజు 330 షోలు వరకూ పడబోతున్నాయి.

బెంగళూరులోనూ భారీగా: తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'హనుమాన్' మూవీకి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్‌ను బెంగళూరు సిటీలోనూ భారీగానే ప్లాన్ చేశారు. అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 89 షోలు ప్రదర్శితం కాబోతున్నాయి. ఇందుకోసం బెంగళూరులోని ప్రధాన థియేటర్లు, మల్టీఫెక్సులు రెడీ అవుతున్నాయి.
తొలి తెలుగు సినిమాగా: 'హనుమాన్' మూవీ ఇప్పుడు బెంగళూరు నగరంలో అదిరిపోయే రికార్డును నమోదు చేసింది. అక్కడ అత్యధిక పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతున్న తొలి తెలుగు చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పింది. అదే సమయంలో హాలీవుడ్ మూవీ 'జాన్ విక్ 4'తో సమంగా (89 షోలు) నిలిచింది. దీంతో ఇప్పుడు కర్నాటక వ్యాప్తంగా 'హనుమాన్' మూవీ పేరు మారుమ్రోగిపోతోంది.


Click it and Unblock the Notifications











